Renu Desai: నా ఆరోగ్యం బాగానే ఉంది.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్..!

  • November 19, 2021 / 09:03 AM IST

రేణు దేశాయ్ ఓ పక్క బుల్లితెర పై షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. తన మనసులో ఉన్న అభిప్రాయాలను, సామాజిక అంశాల పై స్పందిస్తూనే తన పిల్లలు అఖీరా, ఆద్య లకి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు ఆమె పెట్టె పోస్ట్ లకి అలాగే అఖీరా ఫొటోలకి పవన్ అభిమానులు.. కామెంట్లు చేయడం లేదా జూనియర్ పవర్ స్టార్ అంటూ అఖీరా గురించి అనడం ఆమెకు నచ్చదు.

చాలా సార్లు ఈ విషయాల పై ఆమె మండిపడింది కూడా.! అయితే ఎందుకో కొంతకాలంగా ఆమె ఇన్ స్టాగ్రామ్ కి దూరంగా ఉంటుంది.దాంతో ఈమెకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా సంభవించాయా? అంటూ కొందరు నెటిజెన్లు ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. వీటికి రేణు దేశాయ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘ఇన్ స్టాగ్రామ్ నుండీ లాంగ్ బ్రేక్ తీసుకున్నాను.ఆందోళన చెందకండి నాకేమి కాలేదు.నేను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నాను. అన్ని విధాలుగా బాగున్నాను.

నా క్షేమసమాచారం ప్రయత్నించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అంటూ పేర్కొంది రెండు దేశాయ్. అంతేకాదు ఆమె కొత్త ఫోటోలని కూడా షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆద్య కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక అఖీరా, ఆద్యలతో కలిసి హైదరాబాద్లోనే ఉంటుంది రేణు దేశాయ్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus