Renu Desai: మొత్తానికి రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చేసింది..!

పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. పవన్ తో విడాకుల అనంతరం రేణు.. తన పిల్లల బాగోగులు చూసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. బుల్లితెర పై జడ్జిగా వ్యవహరించడంతో పాటు ఓ సినిమాకి డైరెక్షన్ చెయ్యడానికి కూడా ఆమె సన్నాహాలు చేస్తుంది.ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ నేపథ్యంలో అఖీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకు రేణు దేశాయ్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ‘అఖీరా టాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడడానికి ఇది సందర్భం కాదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు కరోనా పరిస్థితుల గురించి చర్చించుకుందాం. కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ఆద్య ,అకిరా ఇంట్లోనే ఉంటున్నారు. గత నెల రోజుల నుండీ వాళ్ళు అడుగు బయట పెట్టలేదు.మిగతా పిల్లల్లానే వాళ్ళు కూడా ఫ్రస్టేట్ అవుతున్నారు.

‘ అంటూ రేణు చెప్పుకొచ్చింది. గతంలో అఖీరా టాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్నించినప్పుడు.. రేణు ‘అతనికి నటనపై ఆసక్తి లేదు’ అంటూ చెప్పుకొచ్చేది. కానీ ఈసారి మాత్రం ఇది సందర్భం కాదు అని చెప్పింది. అంటే ఇండైరెక్ట్ గా ఆమె హింట్ ఇచ్చినట్టే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. పైగా అఖీరా ని హీరోగా పరిచయం చేయాలని మెగాస్టార్ కూడా పవన్ తో పలుమార్లు డిస్కస్ చేసినట్టు టాక్ కూడా వినిపించింది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus