Renu Desai: రేణు దేశాయ్ ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా.. వైరల్ అవుతున్న పోస్ట్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా గుర్తింపు పొందిన ఎంతోమంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. అందంగా కనిపించడానికి వారు వేసుకుని మేకప్ వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఇలా అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. తాజాగా సమంత కూడా మయోసైటిస్ అనే అరుదైన చర్మవ్యాధి నుండి బయటపడింది. అయితే ఈ వార్త విని ఆనందపడేలోపే మరొక హీరోయిన్ అనారోగ్యం పాలైనట్లు స్వయంగా వెల్లడించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.

పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించిన రేణుదేశాయ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి జానీ సినిమాలో కూడా నటించింది. బద్రి సినిమా షూటింగ్ సమయంలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి 2009లో వివాహం చేసుకుంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2012లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీళ్లకు అకీరా, ఆద్య అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక రేణు దేశాయ్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా గుర్తింపు గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాలలో తక్కువగా కనిపించే రేణుదేశాయ్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన అనారోగ్య విషయం గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈక్రమంలో ‘శ్రేయోభిలాషులారా మీకో విషయం చెప్పాలి. గత కొన్నేళ్ల నుంచి గుండె, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నాను. ఈ మేరకు బలం తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. నేను మాత్రమే కాదు నాలా అనారోగ్యంతో బాధపడే వారు బలంగా నిలబడాలనే, పాజిటివ్ ఎనర్జీ కోసమే ఈ పోస్ట్ పెడుతున్నాను.

ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాసరే ధైర్యం కోల్పోవద్దు. ఏదో ఓ రోజు మనకు ఫలితం వస్తుంది. ఎప్పటికీ ఆశ కోల్పోవద్దు. జీవితంతో పాటు మనపై మనకు నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచం మనకు ఎన్నో సర్ ప్రైజులు ప్లాన్ చేసి ఉంచింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వాటిని నవ్వుతూ స్వీకరించండి. నేను ఇప్పడు చికిత్స తీసుకుంటూ మళ్లీ మామూలు అవ్వటానికి నా వంతు దైర్యంగ కృషి చేస్తున్నాను” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus