బెల్లంకొండకు హ్యాండిచ్చిన పవన్ మాజీ భార్య..!

గతంలో సూపర్ హిట్ సినిమాలతో రాణించిన కొందరు హీరోయిన్లు ఇప్పుడు అక్క, వదిన, పాత్రల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రంలో సింధు తులాని, ‘వినయ విధేయ రామా’ చిత్రంలో స్నేహ ను ఈ విషయానికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ కోవలో రేణు దేశాయ్ కూడా చేరబోతుందని వార్తలు వచ్చాయి. రేణు దేశాయ్.. ఓ నటిగా కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే ఎక్కువ పాపులర్ అయ్యింది. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటుంది. ఈ మధ్యనే రెండో పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన రేణు దేశాయ్..ఆ తర్వాత ఈ విషయమై సెలెంట్ అయిపోయింది.

ఇదిలా ఉండగా… బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వర్రారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న బయోపిక్‌లో నటించడానికి రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను ‘దొంగాట’ ఫేమ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రేణు దేశాయ్..బెల్లంకొండ శ్రీనివాస్‌కు అక్కపాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దాదాపు ఈమె ఎంట్రీ ఫిక్సని కూడా టాక్ నడిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. రేణు దేశాయ్ ఈ చిత్రం నుండీ తప్పుకున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ను సినిమాల్లోకి తీసుకోవద్దు అని దర్శక నిర్మాతల్ని కోరాడంటూ కొన్ని కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఇవి పక్కన పెట్టినా… రేణు దేశాయ్ రీ ఎంట్రీ క్యాన్సిల్ అయ్యిందని మాత్రం తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus