పవన్ అభిమానుల పై ఓ రేంజ్లో మండిపడ్డ రేణు దేశాయ్

నిన్న అల్లు అర్జున్, అఖిల్ ల బర్త్ డే మాత్రమే కాదు అఖీరా నందన్ బర్త్ డే కూడా..! అందుకే రేణు దేశాయ్ ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ‘నా కొడుక్కి 19 ఏళ్లు వచ్చాయి. చెట్టంత ఎదిగినా కూడా తల్లికి ఎప్పుడూ కొడుకే..! ఇంకా అకిరా నా ఒళ్లో సరిగ్గా సరిపోతోన్నాడు’ అంటూ తన కొడుకు పై ఉన్న తల్లి ప్రేమను చూపించింది రేణు దేశాయ్. అయితే ఈ క్రమంలో ఓ పవన్ అభిమాని..

“మేడం ఇది చాలా అన్యాయం.. మా అకిరా బాబుని ఒకసారి అయినా చూపించండి.. మా అన్న కొడుకుని చూడాలని ఉంటుంది. మీరు ఇలా దాచడం వంటివి చేయకండి.. అప్పుడప్పుడు అయినా వీడియోలో అకిరా బాబుని చూపించండి” అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ రేణు దేశాయ్ కు ఓ రేంజ్లో కోపం తెప్పించింది. ఆ అభిమాని కామెంట్స్ పై రేణు స్పందిస్తూ..

“మీ అన్న కొడుకా?.. అకిరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా?.. మీరు ఆయనకు వీరాభిమానులు అని నేను అర్థం చేసుకుంటాను. కానీ పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోండి.. ఇలాంటి మెసెజ్‌లను నేను పట్టించుకోవడం మానేశాను.. మీరు హద్దులు మీరి ఇలా మాట్లాడుతున్నారు.ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు.

ఈ రోజు ఇలాంటి కామెంట్లు చేస్తుండటం నాకు బాధగా ఉంది..” అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ అభిమానులకు , రేణు దేశాయ్ కి మధ్య ఇలాంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus