అభిమానులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ తెలుగు సినీ పరిశ్రమకి దూరంగా ఉన్నప్పటికీ పవన్ అభిమానులకు దగ్గరగానే ఉన్నారు. సోషల్ మీడియాలో టచ్ లోనే ఉన్నారు. తన కొడుకు అకిరా, కూతురు ఆద్య గురించి అప్డేట్ ఇస్తుంటారు. అలాగే తనని విమర్శించిన వారికి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంటారు. తాజాగా అలాంటి సంఘటన మరొకటి జరిగింది. రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అకీరా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను షేర్ చేస్తూ.. “నా క్యూటీ చూడటానికి యురోపియన్‌ సినిమాలోని ఓ సీరియస్‌ క్యారెక్టర్‌లా ఉన్నాడు. ఓ గేమ్‌ కోసం తన ల్యాప్‌టాప్‌లో ఆసక్తిగా వెతుకుతున్నాడు” అని పోస్ట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ బ్రాకెట్లో .. “ఎవరైనా జూనియర్‌ పవన్‌కల్యాణ్‌ అని కామెంట్‌ చేస్తే వారిని నా అసిస్టెంట్‌ డిలీట్‌ చేసి, బ్లాక్‌ చేస్తాడు.

జూనియర్‌ పవన్‌ కల్యాణ్‌ అని పిలవడం అకీరాకు, వాడి నాన్నకు, వాడి అమ్మనైన నాకు ఇష్టం లేదు. కాబట్టి మీరు అలా పిలవడం ఆపండి” అంటూ ఇండైరెక్ట్ గా అలా పిలిచే పవన్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇచ్చారు. ఈ పోస్ట్ పై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. మంచి నిర్ణయం అంటూ కొంతమంది మద్దతు తెలిపితే .. మరికొంతమంది అకీరా హీరో కావడం ఇష్టం లేదా?.. అంటూ కామెంట్లు చేశారు. అందుకు కూడా రేణు సమాధానం ఇచ్చారు. “మా పిల్లలు సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని కష్టపడుతున్నారు. తలిదండ్రుల నీడలో ఎదగాలని వారు కోరుకోవడం లేదు” అని స్పష్టం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus