Renudesai: ఆ సీనియర్‌ జర్నలిస్ట్‌కు క్లాస్‌ పీకిన రేణు దేశాయ్‌… ఏమన్నారంటే?

సినిమా ఇండస్ట్రీ గురించి అందరికీ అన్నీ తెలుసు అని అనుకుంటారు కానీ… చాలా విషయాలు తెలియనవి ఉంటాయి. అలాంటి విషయాలను చెబుతాం అంటూ కొంతమంది సీనియర్‌ జర్నలిస్ట్‌లు వస్తుంటారు. గతంలో కొంతమంది అక్కడక్కడా వ్యాసాలు రాసేవారు. అయితే సోషల్‌ మీడియా యుగానికి వచ్చేసరికి యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. అలా తన గురించి, తన కుటుంబం గురించి కొన్ని విషయాలు చెబుతున్న ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ను నటి రేణు దేశాయ్‌ కడిగిపారేశారు.

ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేస్తూ దాంతోపాటు పెద్ద కామెంట్‌ ఒకటి పెట్టారు. అందులో ఆమె బాధతోపాటు, ఇలాంటి కామెంట్లు పడుతున్న మహిళల గురించి కూడా ప్రస్తావించారు రేణు దేశాయ్‌. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్‌ ఇటీవల రీ ఇంట్రీ ఇచ్చారు. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాలో కీలక పాత్ర పోషించి అలరించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సినిమా నిరాశపరిచింది అనుకోండి.

అయితే రేణు దేశాయ్‌ (Renudesai) మళ్లీ తెరపైకి రావడంపై ఓ జర్నలిస్ట్‌ ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడారు. అందులో ఆమె వ్యక్తిగత విషయాలపైనా ఆయన కొన్ని కామెంట్స్‌ చేశారు. ఆ వీడియో అలా అలా రేణు దేశాయ్‌ వరకు చేరినట్లుంది. అందులో కొన్ని మాటల్ని కట్‌ చేసి… మొత్తంగా ఓ వీడియోలా చేసి సోషల్‌ మీడియాలో పెట్టారు రేణు. అలాగే ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సధించారు. ఈ క్రమంలో మహిళలను తక్కువగా చూడడం తగదని సలహా ఇచ్చారు.

అంకుల్‌ మీరు నా గురించి మాట్లాడి వ్యూస్‌ సంపాదిస్తున్నారు. నా పేరు వాడుకుని డబ్బులు సంపాదిస్తున్నందుకు ఆనందమే. కూర్చొని నటులపై గాసిప్స్‌ చెప్పే కంటే మీ టాలెంట్‌తో సంపాదిస్తే ఇంకా బాగుంటుంది. ఇంత వయసొచ్చిన తర్వాత కూడా మీరు ఇలా చేస్తే ఎలా. మిమ్మల్ని నేనెప్పుడూ కలవలేదు. నా గురించి మీకు తెలియదు. కానీ నాపై ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అని పేరు ఎత్తకుండానే కౌంటర్‌ వేశారు. అయితే ఆయన తన గురించి మాట్లాడినందుకే ఆ పోస్ట్‌ పెట్టలేదని, సమాజంలో మహిళలపై కొందరు మగవారికి ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పడానికే ఇలా చేసినట్లు రేణు తెలిపారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus