Republic Review: రిపబ్లిక్ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.!

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రిపబ్లిక్ మూవీ రేపు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాను చూసి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా రిపబ్లిక్ సినిమాపై తన అభిప్రాయాన్ని నాని వెల్లడించారు. తాను రిపబ్లిక్ సినిమా చూశానని సినిమా చాలా బాగుందని నాని అన్నారు.

సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని మనం చేస్తున్న ప్రేయర్స్ రిపబ్లిక్ రూపంలో తిరిగి వచ్చాయని నాని చెప్పుకొచ్చారు. దేవా కట్టాకు రిపబ్లిక్ మూవీ కం బ్యాక్ ఫిల్మ్ అవుతుందని నాని తెలిపారు. ప్రస్థానం సినిమా తర్వాత దేవా కట్టా రాజకీయాలను బేస్ చేసుకుని సొసైటీకి అవగాహన కల్పించే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. జగపతిబాబు, రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తుండటం గమనార్హం. నాని పాజిటివ్ గా చెప్పడంతో రిపబ్లిక్ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు నాగబాబు, థమన్ తేజ్ కోలుకుంటున్నాడని చెబుతున్నారు. రిపబ్లిక్ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు నెలకొన్నాయి. ఏపీలో ఈ సినిమా ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో రిలీజవుతూ ఉండటం గమనార్హం. రిపబ్లిక్ సినిమాతో సాయితేజ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఐశ్వర్య రాజేష్ కు తెలుగులో సినిమా ఆఫర్లు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus