KGF2: మళ్లీ రాకీ అవతారం ఎత్తనున్న యశ్‌… నిజమేనా?

రాకీగా ‘కేజీఎఫ్‌’లో యశ్‌ ఎంతగా అదరగొట్టాడో మనందరికీ తెలిసిందే. ఒక్క సినిమాలో శాండిల్‌ వుడ్‌ స్టార్‌ కాస్త పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు. ‘కేజీఎఫ్‌ 2’తో మరోసారి అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తయిపోయింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఏప్రిల్‌ 14న సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. అయితే ఇప్పుడు యశ్‌ మరోసారి రాకీగా మారబోతున్నాడా? అవుననే అంటున్నాయి శాండిల్‌వుడ్‌ వర్గాలు.

Click Here To Watch

యశ్‌.. మళ్లీ రాకీ అవుతున్నాడు అంటే మూడో ‘కేజీఎఫ్‌’ వస్తుందని కాదు. ‘కేజీఎఫ్‌ 2’ సినిమాను రీషూట్‌ చేస్తున్నారని. అవును ‘కేజీఎఫ్‌ 2’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తారని సమాచారం వస్తోంది. ఇటీవల ‘కేజీఎఫ్‌ 2’ యశ్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ చూసిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అండ్‌ టీమ్‌ ఆశించిన స్థాయిలో లేదని, మరోసారి తెరకెక్కిస్తే బెటర్‌ అని అనుకున్నారట. దీంతో యశ్‌ను తిరిగి రాకీ అవతారం ఎత్తమని అడుగుతున్నారట. ‘కేజీఎఫ్‌’ సమయంలో పాన్‌ ఇండియా సినిమాలు లేవు. కానీ ఇప్పుడు చాలా వచ్చాయి, వస్తున్నాయి. దీంతో మరింత పక్కాగా ఉండాలని ప్రశాంత్‌ అనుకుంటున్నారట.

హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో ఐదు రోజుల పాటు కొత్త షెడ్యూల్‌ ప్లాన్‌ చేసినట్లు శాండిల్‌ వుడ్‌ వర్గాల సమాచారం. ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ నేతృత్వంలో మరింత రిచ్‌గా, గ్రాండ్‌గా ఇంట్రో సాంగ్‌ ఉండేలా ప్రశాంత్‌ నీల్‌ ఇప్పుడు చూసుకుంటున్నారని టాక్‌. అయితే దీని వల్ల సినిమా విడుదల తేదీలో ఏమైనా మార్పు వస్తుందేమో అని యశ్‌ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారట. అయితే అలాంటిదేం లేదని, అనుకున్న సమయానికే సినిమా విడుదల చేస్తారని సమాచారం.

అయితే ఏప్రిల్‌ 14న విజయ్‌ – నెల్స్‌ దిలీప్‌ కుమార్‌ ‘బీస్ట్‌’ సినిమాను కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. తమిళ సంవత్సరాది నేపథ్యంలో విజయ్‌ ఆ డేట్‌ ఎంచుకున్నాడని టాక్‌. ఆ సినిమా కూడా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. దీంతో బాక్సాఫీసు దగ్గర ఎలాంటి సందడి, వసూళ్ల హడావుడి ఉంటుందో అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus