Retro: సూర్య ‘రెట్రో’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)  సినిమాలు సమాంతరంగా తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి. అతనికి తెలుగులో ఉన్న క్రేజ్ అలాంటిది. ఇటీవల సూర్య నుండి వచ్చిన ‘ఈటి’ సినిమా పెద్దగా ఆడింది లేదు. తర్వాత వచ్చిన ‘కంగువా’ (Kanguva) భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ సూర్య క్రేజ్ కానీ, మార్కెట్ కానీ దెబ్బ తిన్నది లేదు. అతని లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ (Retro) కి కూడా తెలుగులో బిజినెస్ బాగానే జరిగింది.

Retro

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై నాగవంశీ (Suryadevara Naga Vamsi)  ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఒకసారి ‘రెట్రో’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :

నైజాం 3.00 cr
సీడెడ్ 1.20 cr
ఉత్తరాంధ్ర 1.50 cr
ఈస్ట్ 0.40 cr
వెస్ట్ 0.28 cr
గుంటూరు 0.50 cr
కృష్ణా 0.50 cr
నెల్లూరు 0.22 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 7.60 cr

‘రెట్రో’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.7.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే.. సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ తో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ఆడియన్స్ కు ‘హిట్ 3’ అనే ఆప్షన్ ఉంది కాబట్టి.. దీన్ని అవాయిడ్ చేసే ప్రమాదం కూడా లేకపోలేదు.

‘హిట్ 3’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus