Bigg Boss Telugu6: ఆదిరెడ్డి చేసిన ఆ పని వల్లే రేవంత్ , శ్రీహాన్ ఇద్దరూ ఓడిపోయారా ?

బిగ్ బాస్ హౌస్ లో అతి ముఖ్యమైన విలువైన ఎవిక్షన్ ఫ్రీపాస్ కి సంబంధించిన టాస్క్ పూర్తయ్యింది. ఇందులో శ్రీహాన్, రేవంత్ ఇద్దరూ లాగ్స్ ని పట్టుకుని అటు ఇటు దాదాపుగా 10 ఇసుక బస్తాలని చాలాసేపు కావడి పట్టుకున్నట్లుగా పట్టుకున్నారు. భుజాలు గుంజుతున్నా, శరీరం అలసిపోతున్నా సరే లెక్కచేయలేదు. టాస్క్ లో ఎలాగైనా సరే గెలవాలన్న కసి వారిలో కనిపించింది. అందుకే, చివరి నిమిషం వరకూ కూడా పోరాడారు. ఆదిరెడ్డి మాత్రం తన అక్కసుని కుళ్లుని చూపించాడు. మనం అసలు మేటర్లోకి వెళితే, ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం రెండు లెవల్స్ లో టాస్క్ పెట్టాడు బిగ్ బాస్.

మొదటి లెవల్ లో గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన బజర్ ని నొక్కాల్సి ఉంటుంది. ప్లాస్మాపై చూపించిన ఎమౌంట్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచీ తగ్గించేందుకు ఇష్టమైన పార్టిసిపెంట్ ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేయచ్చని లింక్ పెట్టాడు బిగ్ బాస్. అంతేకాదు, టాస్క్ లో కేవలం ముగ్గురు మాత్రమే పార్టిసిపేట్ చేయాలని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ చాలాసేపు ఆలోచించారు. ఫస్ట్ నుంచీ కూడా ఆదిరెడ్డి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని వ్యతిరేకిస్తూ వచ్చాడు. పాస్ వచ్చినా కూడా నేను వేరేవాళ్లకి వాడను అన్నాడు. అలాగే, మొదట్లో పాస్ కోసం విన్నర్ ప్రైజ్ మనీని తగ్గించాలని నేను అనుకోవట్లేదు ఉన్నాడు.

ఇలా తనకే క్లారిటీ లేకుండా అయిష్టంగానే బజర్ రౌండ్ లో పార్టిసిపేట్ చేశాడు. ఫస్ట్ బజర్ రౌండ్ లో 80వేలు ఎమౌంట్ రాగానే ఫైమా బజర్ నొక్కింది. ఫస్ట్ పార్టిసిపేట్ అయ్యింది. ఇక్కడే ఫైమాకి ఆదిరెడ్డి ఉపదేశం చేశాడు.ఎవిక్షన్ ఫ్రీ పాస్ సంపాదించినా వేస్ట్ అని, జనాలు ఆవారం ఓట్లు వేయరని అన్నాడు. అలాగే, తను అలా సేవ్ అవ్వడం కూడా ఇష్టం లేదని, ఈ పాస్ ద్వారా వేరేవాళ్లని సేఫ్ చేయడం కూడా తనకి చెప్పాడు. ఆ తర్వాత శ్రీహాన్ 1 లక్షా 50వేలకి బజర్ ని నొక్కి రెండో పార్టిసిపెంట్ అయ్యాడు. ఆ తర్వాత రేవంత్ 1 లక్షా 200 రూపాయలకి బజర్ ని ప్రెస్ చేశాడు.

దీంతో ఫైమా, రేవంత్, శ్రీహాన్ ముగ్గురు ఎవిక్షన్ ఫ్రీపాస్ కోసం పోటీపడ్డారు. ఫైమా, రేవంత్, శ్రీహాన్ ముగ్గురికీ లాగ్ వార్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. భుజాలపై కర్రని వేసుకుని కావడి మోసనట్లుగా ఉండాలి. మిగతా హౌస్ మేట్స్ బజర్ మోగినప్పుడల్లా తమ మద్దతు ప్రకటించుకుంటూ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అవసరం లేని వాళ్ల భుజంపై ఇసుక బస్తాలని వేయాలని చెప్పాడు బిగ్ బాస్. ఇక్కడే అసలు సిసలైన టాస్క్ ప్రారంభం అయ్యింది. ఫస్ట్ ఇసుక బస్తాని దక్కించుకున్న ఆదిరెడ్డి రేవంత్ ని టార్గెట్ చేశాడు. ఫైమాకి నా సపోర్ట్ అని, అమ్మాయి కాబట్టి సపోర్ట్ చేశానని చెప్పాడు. ఈ టాస్క్ లో అమ్మాయిలకి కష్టం అని అనిపించిందని అన్నాడు.

అంతేకాదు, ట్రక్ టాస్క్ అప్పుడు శ్రీహాన్, శ్రీసత్య ఇద్దరూ ఉన్నప్పుడు నువ్వు అమ్మాయి కాబట్టి టాస్క్ ఈజీగా ఉంటుందని శ్రీసత్యని తీస్కుందాం అన్నావని , అదే నువ్వు గోల్ పోస్ట్ గేమ్ లో ఇనాయాని అవుట్ చేసి అమ్మాయిపై గెలవడం ఇష్టంలేదని చెప్పావ్ అని ఇలా రెండు మాటలు మార్చావ్ అని అందుకే వేశా అన్నాడు ఆదిరెడ్డి. దీంతో రేవంత్ కి ఫీజులు ఎగిరిపోయాయి. నువ్వు అమ్మాయిపై ఆడి గెలవడం కాదని చెప్పి కెప్టెన్సీ టాస్క్ లో అవుట్ అయ్యావ్ అందుకే ఇనాయని ఫస్ట్ అవుట్ చేయాలని చూశాను అంటూ రేవంత్ సాలిడ్ పంచ్ ఇచ్చాడు. ఇక్కడ క్లియర్ గా ఫైమాకి ఆదిరెడ్డి సపోర్ట్ చేసినా కూడా కెప్టెన్సీ టాస్క్ లో శ్రీహాన్, రేవంత్ కలిసి తనని అవుట్ చేశారన్న కుళ్లు కనిపించింది.

అంతేకాదు, ఛాన్స్ దొరికితే రేవంత్ ని ఎక్కేద్దామనే చూస్తున్నారు ఆదిరెడ్డి. ఇక ఈ టాస్క్ లో శ్రీహాన్ కి పది బస్తాలు, రేవంత్ కి పది బస్తాలు వరకూ వేశారు హౌస్ మేట్స్. దీంతో వాళ్లిద్దరూ బరువు మోయలేక చాలా అవస్థలు పడ్డారు. చాలాసేపు వాటిని మోస్తూ మొనగాళ్లు అనిపించుకున్నారు. ఫస్ట్ శ్రీహాన్ అవుట్ అయితే, చాలాసేపు రేవంత్ శ్యాండ్ బ్యాగ్స్ ని మోశాడు. రేవంత్ ఈ టాస్క్ లో చూపించిన మొండితనం అందరికీ బాగా నచ్చింది. కానీ, చివరకి బ్యాగ్స్ మోయలోక వదిలేశాడు. దీంతో ఫైమా ఇమ్యూనిటీని దక్కించుకుంది. అదీ మేటర్.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus