బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 21మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. గత సీజన్స్ లో ఎప్పుడూ కూడా ఇంతమంది ఒకేసారి హౌస్ లో లేరు. అందులోనూ హాట్ స్టార్ లో 24గంటలు స్ట్రీమింగ్ రావడం అనేది ఈసీజన్ కి హైలెట్ అని చెప్పాలి. టెలివిజన్ లో కేవలం గంట మాత్రమే చూస్తుంటే ఓటీటీ లో బిగ్ బాస్ లవర్స్ లైవ్ స్ట్రీమింగ్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో పార్టిసిపెంట్స్ ఏం మాట్లాడినా కూడా ఆడియన్స్ కి తెలిసిపోతోంది.
అయితే, ఈ సీజన్ లో ఒకరిపై ఒకరు జోకులు వేసుకోవడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడటం అనేది ఎక్కువైంది. ముఖ్యంగా జబర్ధస్త్ నుంచీ వచ్చిన ఫైమా, చంటి పంచ్ డైలాగ్స్ వేస్తునే ఉన్నారు. రాజ్ కెప్టెన్సీ పోటీదారుడుగా ఉన్నప్పుడు కంటెండర్ అంటూ టీజ్ చేశాడు చంటి. ఆ తర్వాత హౌస్ లోకి హీరో సుదీర్ బాబు, హీరోయిన్ కృతిశెట్టి గెస్ట్ లుగా వచ్చినపుడు కూడా రేవంత్ పై జోకులు వేశాడు. తను యాక్టింగ్ చేస్తుంటే పంచ్ డైలాగ్స్ వేశాడు. దీంతో రేవంత్ అక్కడిక్కడే చంటికి కౌంటర్ వేసాడు.
ఆ తర్వాత కూడా రేవంత్ చంటి గురించి, ఫైమా గురించి బాలాదిత్య దగ్గర చెప్పుకున్నాడు. నేను సింగర్ అని నేను పాడితే అందర్నీ కూర్చోబెట్టగలిగే టాలెంట్ ఉందని, యాక్టర్ ని కాదని చెప్పాడు. చంటి నాపై జోకులు వేస్తుంటే నచ్చట్లేదని చెప్పాడు. అసలు ఈ ఫైమా ఎవరన్నా నాపై పంచ్ లు వేయడానికి అన్నట్లుగా మాట్లాడాడు. ఇక్కడ రేవంత్ ఎప్పటికప్పుడు తన స్టేచర్ ని చూపించుకోవాలని అనుకుంటున్నాడా లేదా ఎదుటివాళ్లు జోకులు వేసినపుడే అది గుర్తొస్తోందా అనేది ఆసక్తిగా మారింది. అంతేకాదు, ఫస్ట్ వారం గీతుతో పడలేదు. ఆ తర్వాత గీతుతో కలిసిపోయాడు.
ఇప్పుడు ఇద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అవుతున్నారు. ఇక ఇప్పుడు చంటి, శ్రీహాన్, అర్జున్, ఫైమా లతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి టాస్క్ లో, లేదా ప్రతి ఎపిసోడ్ లో ఏదో విధంగా రేవంత్ ట్రిగ్గర్ అవుతునే ఉన్నాడు. ఫస్ట్ రెండు వారాలు నామినేషన్స్ లోకి వచ్చిన రేవంత్ టాప్ పొజీషన్ లో ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో రేవంత్ ఆవేశ పడితే మాత్రం ఖచ్చితంగా అతని ఓటింగ్ పై ప్రభావం చూపిస్తుంది. మరి ఈసమయంలో వీకండ్ నాగార్జున రేవంత్ కి ఎలాంటి క్లాస్ పీకుతారు అనేది చూడాలి. మొత్తానికి అదీ మేటర్.