ఈసారి విన్నర్ కి పండగే..! శనివారం ఎపిసోడ్ లో సీక్రెట్ చెప్పిన నాగార్జున..!

బిగ్ బాస్ హౌస్ లో వీకండ్ ఎపిసోడ్ అంటేనే ప్రేక్షకులకి మంచి కిక్ వస్తుంది. ఎందుకంటే, హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ ని పలకరిస్తూ వాళ్లతో గేమ్స్ ఆడిస్తూ వాళ్ల మద్యలో ఫిట్టింగ్స్ పెట్టి వెళ్తుంటాడు. లాస్ట్ వీక్ కూడా హౌస్ మేట్స్ మద్యలో చిచ్చుపెట్టాడు నాగార్జున. మీరే ఎందుకు విన్నర్ అవ్వాలి. జనాలు మీకు ఓట్లు ఎందుకు వేయాలి అనేది టాస్క్ రూపంలో ఆడించాడు. హౌస్ మేట్స్ తో చెప్పించాడు. శ్రీహాన్ – రేవంత్ ఈవిషయంలో చాలాసేపు ఆర్గ్యూ చేస్కున్నారు.

అలాగే కీర్తి-శ్రీసత్య, ఆదిరెడ్డి ఇంకా ఇనయా తమకే ఎందుకు ఓట్లు వేయాలి అన్నది చెప్పారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ కన్ఫెషన్ రూమ్ లో దెయ్యం టాస్క్ లో ఎంత ఫన్ చేశారు అనేది చూపించాడు హోస్ట్ నాగార్జున. ఈసీజన్ లోనే ఇది బిగ్గెస్ట్ ఎంటర్ టైన్మెంట్ టాస్క్ అంటూ చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ కూడా ఆ వీడియోలని చూసి బాగా ఎంజాయ్ చేశారు.ఆ తర్వాత రేవంత్ ని , ఇంకా కీర్తిని ఈవారం సేఫ్ అంటూ ప్రకటించాడు.

అంతేకాదు, వీళ్ల ముగ్గురు ఫైనలిస్ట్ లు అంటూ కన్ఫార్మ్ చేశాడు. ఇక్కడే ఈ ముగ్గురిని మిగతా నలుగురులో ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పమని అడిగాడు. దీంతో ఫస్ట్ శ్రీహాన్ మొహమాట పడుతూనే రోహిత్ పేరు చెప్పాడు. అలాగే కీర్తి ఆదిరెడ్డి పేరు చెప్పింది. ఇక రేవంత్ ఇనయకి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిందని అందుకే తను వెళ్లిపోతుందేమో అని అనిపిస్తోందని అన్నాడు. ఇనయా ఎలిమినేషన్ ని ముందుగానే ఊహించాడు రేవంత్. తర్వాత నాగార్జున తన ముందు మూడు బ్రీఫ్ కేస్ లని పెట్టుకుని ఎందులో ఎక్కువ మొత్తం ఉందో గెస్ చేయమని చెప్పాడు.

దీంతో హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో లెఫ్ట్ సైడ్ బ్రీఫ్ కేస్ ని సెలక్ట్ చేస్తే, అందులో మూడు లక్షల రూపాయలు ఉన్నాయి. దీంతో ప్రైజ్ మనీ 50 లక్షలకి చేరింది. ఈ ప్రైజ్ మనీతో పాటుగా సువర్ణభూవి వాళ్లు ఇచ్చే 605గజాల ప్లాట్ కూడా విన్నర్ సొంతం అవుతుంది. ఇక ఆ తర్వాత మారుతి సుజికీ మార్కెంటింగ్ జనరల్ మేనేజర్ స్టేజ్ పైకి వచ్చి విన్నర్ కి బ్రిజా కార్ ని ఎనౌన్స్ చేశాడు. దీంతో ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ కి పండగే అని చెప్పాలి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus