ఫినాలే టిక్కెట్ టాస్క్ లో రెచ్చిపోయిన రేవంత్..! సంచాలక్ గా ఆదిరెడ్డి చేసిన తప్పేంటంటే.,

బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. నాగార్జున హోస్ట్ చేసిన ఎపిసోడ్ లోనే రేస్ టు ఫినాలే టాస్క్ లో ఆఖరి టాస్క్ ని చూపించారు. ఇందులో రేవంత్ ఇంకా శ్రీహాన్ ఇద్దరూ కూడా ఫైనల్ గా రోప్ టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. దీనికి ఆదిరెడ్డిని సంచాలక్ గా నియమించాడు బిగ్ బాస్. అయితే, ఇక్కడే శ్రీహాన్ ఇంకా రేవంత్ ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లుగా గేమ్ లో పోటీపడ్డారు. చేతులు నొప్పి పుడుతున్నా కూడా రోప్స్ తే వేవ్స్ ని తీస్కుని వస్తూ పోటాపోటీగా టాస్క్ ఆడారు.

అయితే, ఈటాస్క్ లో వేవ్స్ ఆగిపోతే అవుట్ ఇస్తానంటూ ఆదిరెడ్డి మద్యలో ఎనౌన్స్ చేశాడు. కానీ, శ్రీహాన్ వేవ్స్ ఆగిపోయినా కూడా ఏమీ మాట్లాడలేదని రేవంత్ కి కోపం వచ్చింది. శ్రీహాన్ మద్యలో రెండుసార్లు ఆపేశాడంటూ అసహనానికి గురి అయిన రేవంత్ రోప్స్ వదిలేసి బయటకి వచ్చేశాడు. దీంతో ఫైనల్ టాస్క్ లో ఓడిపోవాల్సి వచ్చింది. ఆదిరెడ్డి ఇక్కడ సంచాలక్ గా సూపర్ డెసీషన్ తీస్కున్నాడంటూ కింగ్ నాగార్జున పొగిడాడు. కానీ, ఆదిరెడ్డి రోప్ వేవ్స్ చూడటంలో విఫలం అయ్యాడు.

శ్రీహాన్ రెండు సార్లు రోప్ కదిలించకుండా ఆపినా కూడా చూడలేకపోయాడు. నేను చెప్పేలోపే నువ్వు రోప్స్ వదిలేసి రావడం తప్పని రేవంత్ కి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రేవంత్ తన తప్పుని తాను ఒప్పుకున్నాడు. ఇక్కడే రేవంత్ రోప్స్ ని వదిలేసి గేమ్ లో నుంచీ తప్పుకున్న కారణంగా శ్రీహాన్ ని విన్నర్ గా ఎనౌన్స్ చేశాడు. నిజానికి ఈ టాస్క్ లో సంచాలక్ గా చేయడం అనేది కత్తిమీద సాములాంటిది. ఈ టాస్క్ లో శ్రీహాన్ వేవ్స్ వస్తూనే ఉన్నాయంటూ రేవంత్ కి చెప్పాడు. కానీ, రెండు మూడుసార్లు వేవ్స్ రాలేదు.

అయినా కూడా సంచాలక్ ఆదిరెడ్డి లాస్ట్ టాస్క్ కాబట్టి ఛాన్స్ ఇచ్చాడు. ఇద్దరిలో ఎవరు విన్నరో చెప్పేవరకూ ఆగాలని ఆగి ఉంటే నేను శ్రీహాన్ ని తొలగించేవాడ్ని అని ఆ తర్వాత రేవంత్ తో ఆదిరెడ్డి చెప్పాడు. ఇక శనివారం ఎపిసోడ్ లో రేవంత్ వాళ్ల పాపని వీడియో కాల్ ద్వారా చూపించి సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆనందంతో రేవంత్ పాడిన పాట ఎపిసోడ్ లోనే హైలెట్ గా నిలిచింది. మరి ఈవారం ఆదివారం ఎపిసోడ్ లో ఎలాంటి ఫన్ ఉండబోతోంది. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు ఉండబోతున్నారు అనేది ఆసక్తికరం.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus