2025 ఆరంభంలో ‘కథా కమామీషు'(ఓటీటీ ప్రాజెక్టు) అనే మూవీ వచ్చింది. దానికి డీసెంట్ టాక్ అయితే వచ్చింది. తర్వాత సంక్రాంతి కానుకగా ‘గేమ్ ఛేంజర్'(Game Changer) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam) వంటి పెద్ద సినిమాలు వచ్చాయి. ఇందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద విజయం సాధించింది. ‘డాకు మహారాజ్’ పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత ఈటీవీ విన్(ఓటీటీ) లోకి వచ్చిన ‘వైఫ్ ఆఫ్’ మంచి టాక్ తెచ్చుకుంది. ‘డియర్ కృష్ణ’ ‘హత్య’ ‘గాంధీ తాత చెట్టు’ ‘తల్లి మనసు’ ‘పోతుగడ్డ’ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ‘రాచరికం’ వంటి సినిమాలు జస్ట్ వచ్చి వెళ్లాయి అంతే..!
మొత్తంగా (Tollywood) జనవరి నెలలో థియేటర్, ఓటీటీ వంటి వాటితో కలుపుకుని 25 సినిమాల వరకు వచ్చాయి. అందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘డాకు మహారాజ్’ తప్ప ఏదీ మంచి రిజల్ట్ అందుకోలేదు.
ఇక ఫిబ్రవరి నెలలో ‘భవాని వార్డ్ 1997’ ‘ఒక పథకం ప్రకారం’ ‘తండేల్’ (Thandel) ‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) ‘లైలా’ (Laila) ‘తల’ ‘బాపు’ (Baapu) ‘రామం రాఘవం’ (Ramam Raghavam) ‘మజాకా’ (Mazaka) వంటి 30 సినిమాలు వచ్చాయి. ఇందులో ‘తండేల్’ తప్ప అన్నీ ఫ్లాప్ అయ్యాయి.
ఇక మార్చి నెలలో ‘శివంగి’ ‘కోర్టు'(Court) ‘దిల్ రూబా'(Dilruba) ‘ఎల్ 2 : ఎంపురాన్’ (L2 Empuraan) ‘వీర ధీర శూర’ ‘షణ్ముఖ’ ‘రాబిన్ హుడ్’ (Robinhood) ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) వంటి 40 కి పైగా సినిమాలు వచ్చాయి. వీటిలో ‘కోర్ట్’ ‘మ్యాడ్ స్క్వేర్’ తప్ప మరో సినిమా ఆడలేదు.
మొత్తంగా… 2025 క్వార్టర్లీ రిపోర్ట్ ను గమనిస్తే.. 100 కి పైగా సినిమాలు వచ్చాయి. వీటిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘తండేల్’ ‘కోర్ట్’ ‘మ్యాడ్ స్క్వేర్’ మాత్రమే విజయం సాధించాయి. డబ్బింగ్ సినిమాల్లో ‘డ్రాగన్’ సూపర్ హిట్ కొట్టింది.’డాకు మహారాజ్’ అబౌవ్ యావరేజ్ గా నిలిచింది.