ఆధారాలు లేకుండా మీడియాకు లీకులివ్వటం దురదృష్టకరం
- July 22, 2017 / 08:24 AM ISTByFilmy Focus
టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు గురించి రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. సిట్ అధికారులు పూరి జగన్నాథ్, సుబ్బరాజు మిగిలిన సినీ ప్రముఖులు విచారించినట్టుగానే స్కూల్ విద్యార్థులను కూడా విచారిస్తారా..? ప్రస్తుతం మీడియా అకున్ సబర్వాల్ ను అమరేంద్ర బాహుబలి లా చూపిస్తుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు. అకున్ సబర్వాల్ గారి సమగ్రతను ఎవరు అనుమానించటం లేదు. కానీ ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేకుండా మీడియాకు లీకులివ్వటం, ప్రముఖులకు కీర్తికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించటం దురదృష్టకరం’, అంటూ ఎక్సైజ్‌శాఖ ఎప్పటి నుంచో ఉందని, సినిమా వాళ్ల పేర్లు బయటపెట్టడం వల్లే ఆ శాఖ పేరు మొదటిసారి మార్మోగిపోతోందని, తమ పనితనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు సినీ రంగాన్ని ఎక్సైజ్‌శాఖ వాడుకుందని వర్మ వ్యాఖ్యానించారు.
ఈ కామెంట్స్ తో పాటు ప్రముఖ రచయిత సిరాశ్రీ సినిమాలపై రాసిన ఓ కవితను వర్మ తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు. సామాన్యుడి ప్రతీ పనిలో సినిమా వాళ్లు కావాలి, అలాగే వాళ్లు విమర్శించడానికి వాళ్లు వేసే నిందలు బరించడానికి కూడా సినిమావాళ్లే కావాలంటూ సిరాశ్రీ రెండు రోజుల క్రితం తన ఫేస్ బుక్ లో ఓ కవితను పోస్ట్ చేశాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















