Faria Abdullah: స్ట్రాంగ్ ఫరియా ఇలా ఏడ్చేసిందేంటి? ఏమైందంటే?
- August 17, 2026 / 05:40 PM ISTByFilmy Focus Desk
టాలీవుడ్‌లో స్ట్రాంగ్ మైండ్ ఉన్న హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా ఒకరు. ఎవరైనా ఆమె గురించి కామెంట్ చేయాలి అంటే కాస్త ఆలోచిస్తారు అనేవారు. ఎవరి ఫేవర్ గురించి ఆలోచించకుండా.. సినిమాలు చేస్తూ వెళ్తోంది అనే పేరున్న టాలీవుడ్ కథానాయిక ఆమె. అయితే ఇటీవల ఆమె చేసిన ఓ పని, అక్కడికి వెళ్లి మాట్లాడిన కొన్ని మాటలు ఆమెను ట్రోల్ చేయడానికి కారణమయ్యాయి. దీంతో అంత స్ట్రాంగ్ ఫరియా కూడా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టేసుకుంది. అంతలా ఏమైందంటే?
Faria Abdullah
ఫరియా అబ్దుల్లా.. ఇటీవల బోనాల పండుగలో పాల్గొంది. మీరాలమండీలోని అమ్మవారి దేవాలయంలో పాల్గొన్న ఫరియా.. బోనం సమర్పించి.. భక్తులను ఉద్దేశించి మాట్లాడింది. హైదరాబాద్ గొప్పతనం ఇదేనని.. అందరినీ సమంగా తీసుకొని ప్రేమిస్తారు అని గొప్పగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత బయటకు వచ్చి అక్కడున్న పోతురాజులతో కలసి చిన్నగా మాస్ స్టెప్పులు వేసింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటి వల్ల ఆమెకు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి.
బోనాల పండుగలో ఫరియా హిందూ వేషధారణలో కనిపించింది. దీని వల్ల ఆమెకు రెండు వర్గాల నుండి విమర్శలు వస్తున్నాయి. కావాలనే ఇలా చేశావు అంటూ ఇరువర్గాల వారు కామెంట్లు చేస్తున్నారు. తాను ప్రేమ కోసం, శాంతి కోసం, ఐకమత్యం కోసం ప్రార్థిస్తానని.. అందుకోసం పోరాడతానని ఫరియా చెప్పుకొచ్చింది. చుట్టూ ఉన్న మనుషుల్లో దేవుడిని చూడలేకపోవడం అంటే ఏదో మిస్సవుతున్నట్లే అని తనను విమర్శిస్తున్నవారికి జవాబిచ్చింది. ఈ వీడియో మొత్తం ఆమె బాధతో, కన్నీళ్లతోనే కనిపించింది..












