RGV: ఆర్ఆర్ఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ!

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ జక్కన్న సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అటు తారక్ ఇటు చరణ్ కు నటులుగా మంచి పేరు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి తాజాగా ఆర్జీవీ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మధ్య కాలంలో తాను థియేటర్ లో చూసిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటని ఆ సినిమా నాకు సర్కస్ లా అనిపించిందని ఆర్జీవీ అన్నారు.

నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని సర్కస్ చూసే సమయంలో ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో ఇప్పుడు కూడా నాకు అలాంటి ఉత్సాహం కలుగుతోందని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. వంతెన దగ్గర పిల్లాడిని కాపాడే సీన్ లో చరణ్, తారక్ జెమిని సర్కస్ చేస్తున్న భావన తనకు కలిగిందని ఆర్జీవీ కామెంట్లు చేశారు. చావు అంటే భయం లేదని చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి ఉందని ఆర్జీవీ తెలిపారు. ప్రస్తుతం తాను ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తున్నానని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

సినిమాలు ఎప్పటికీ బోర్ గా అనిపించవని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. మణిరత్నంకు నా సినిమాలు నాకు ఆయన సినిమాలు నచ్చవని ఆర్జీవీ తెలిపారు. ఒకసారి ఇద్దరం కలిసి స్క్రిప్ట్ వర్క్ లో కూర్చున్నామని నా మాట ఆయన వినలేదని ఆయన మాట నేను వినలేదని ఆర్జీవీ అన్నారు. ఆ సినిమాలే దొంగ దొంగ, గాయం అని ఆయన వెల్లడించారు. కరెంట్ పోయిన సమయంలో కొవ్వొత్తి, లైటర్ ఏదీ లేకపోతే నన్ను నేను దెయ్యంగా ఊహించుకుంటానని అప్పుడు భయపడాల్సిన పని లేదని ఆయన చెప్పుకొచ్చారు.

అమ్మాయిలను తెరపై తనకంటే అందంగా మరెవరూ చూపించలేరని ఆయన అభిప్రాయపడ్డారు. అయాన్ ర్యాండ్ పుస్తకాలు చదవడం వల్ల నాలో మార్పు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. పల్లీలు విత్ వోడ్కా కలిపి తీసుకోవడాన్ని ఎక్కువగా ఇష్టపడతానని ఆయన కామెంట్లు చేశారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus