మీకేంటి తక్కువ సర్, మీ సినిమా ‘భీమ్లా నాయక్’ వెంటనే రిలీజ్ చేసేయండి. రికార్డులు బద్దలుకొట్టేయండి అంటూ ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు గుర్తుందా? ఆ ట్వీట్ చూసిన సినిమా ప్రేక్షకులు అయితే పవన్ కల్యాణ్ సినిమా గురించి వర్మ ఇంత వెయిట్ చేస్తున్నారా అని అనుకున్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ‘ఇదేదో తేడాగా ఉందే… పవన్ గురించి వర్మ ఇలాంటి ట్వీట్ చేయడమేంటి?’ అనుకున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ అనుకున్నదే జరిగింది. ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌పై వర్మ ట్వీట్లతో నోరు చేసుకున్నాడు.
‘భీమ్లా నాయక్’ ట్రైలర్ రిలీజ్ అయిన 36 నిమిషాల తర్వాత రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ల దాడి ప్రారంభించారు. తొలుత ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ చూస్తుంటే… ఈ సినిమాను ‘డేనియల్ శేఖర్’ అని పిలవాలేమో అంటూ ఫ్యాన్స్‌ను ఇరిటేట్ చేయడం ప్రారంభించాడు వర్మ. ఆ తర్వాత చిత్రబృందం ఈ సినిమా ద్వారా పవన్ కల్యాణ్‌ను కాకుండా రానాను ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉంది అని అన్నాడు. అక్కడికి కాసేపటికి ట్రైలర్ మీద నా అభిప్రాయం హానెస్ట్‌గా చెప్పాను అంటూ రాసుకొచ్చాడు.
కాసేపు ఆగి నార్త్ ఇండస్ట్రీ గురించి లెక్కలు మాట్లాడే ప్రయత్నం చేశారు వర్మ. నార్త్ ఇండస్ట్రీలో రానాకు మంచి గుర్తింపు ఉందని, ఇప్పుడు ఈ సినిమాను అక్కడకు తీసుకెళ్తే సినిమాలో హీరో రానా అని అనుకుంటారని కామెంట్ చేశారు వర్మ. అసలు దీనికి పవన్ కల్యాణ్ ఎలా ఒప్పుకున్నారు అంటూ ఇంకా ఇరిటేట్ చేసే పని చేశారు రామ్ గోపాల్ వర్మ. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇందుకేనా ‘భీమ్లా నాయక్’ రిలీజ్ చేసేయ్ అంటూ వర్మ కంగారు పెట్టారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ సంగతి చూస్తే… ట్రైలర్‌ను ఇప్పటివరకు సుమారు 85 లక్షలమంది వీక్షించారు. ఇంకా ఈ నెంబరు ముందుకు దూసుకుపోతోంది. ఇక సినిమాను ప్రీ రిలీజ్ వేడుకను 23న నిర్వహించనున్నారు. సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
From all metaphorical and epistemological perspectives and also dishonestly speaking honestly my take on #BheemlaNayakTrailer is that @PawanKalyan is the trailer and @RanaDaggubati is the film
Going by @BheemlaNayakTrailer , in the north where Rana is much more popular than @PawanKalyan due to #Bahubali , there’s a danger of him coming across as the villain in the film and @RanaDaggubati as the hero ..Am shocked why the makers close to P K allowed this to happen?