సినిమాలతో కంటే ప్రకటనలతో ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మీద ఓ బయోపిక్ తీస్తానని ప్రకటించారు. నిజానికి ఈ మాట గతంలోనే చెప్పినప్పటికీ… ఎప్పటిలాగే మరచిపోయారు, మరచిపోయేలా చేశారు వర్మ. ఇప్పుడు మరోసారి ఆ ప్రకటన చేశారు. అంతేకాదు సినిమాను ఎప్పుడు విడుదల చేస్తాం అనే విషయం కూడా ప్రకటించి, సంచలనానికి పెప్ కూడా యాడ్ చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు లెక్క ప్రకారం అయితే 2023లో జరగాలి. అయితే కేసీఆర్ ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఈ ఏడాదిలోనే ఎన్నికలు ఉండొచ్చు అంటున్నారు. ఈ ఎన్నికల విషయం ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే కేసీఆర్ బయోపిక్‌ను తెలంగాణ ఎన్నికలకు ముందే విడుదల చేస్తానని ప్రకటించారు కాబట్టి. అవును, వచ్చే ఎన్నికలకు ముందే ఈ సినిమా సిద్ధం చేసి, విడుదల చేస్తాం అని చెప్పారు వర్మ.
మరి కథ సంగతి, షూటింగ్ పరిస్థితి అంటారా? వర్మకు ఇవన్నీ పెద్ద విషయం కాదు. అనుకుంటే రోజుల్లో పూర్తి చేసేస్తాడు. ఇప్పుడు కూడా అదే మాట అన్నారు. కథ తన మైండ్‌లో ఉందని, నిజ జీవితం ఆధారంగా తీసే సినిమా కావడంతో స్క్రిప్ట్ పెద్ద కష్టమేం కాదని చెప్పారు వర్మ. త్వరలోనే షూటింగ్ ని మొదలుపెడతానని చెప్పుకొచ్చారు వర్మ. అయితే ఇందులో కేసీఆర్‌గా నటించేది ఎవరు అనేది ఆసక్తికరం. ఇక సినిమాను ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరిస్తారు అనేది చూడాలి.
ఇంకో విషయం జీవిత కథల విషయంలో వర్మ ఎప్పుడూ హిట్టే. గతంలో చాలామంది జీవితాలను ఇలా చేశారు. సో వెయిట్ అండ్ సీ ఫర్ కేసీఆర్ బయోపిక్. ఇక ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల విషయం గురించి మాట్లాడుతూ.. ఏపీ టికెట్ల విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తమ సినిమాను ఓటీటీ, థియేటర్ రెండింటిలోనూ విడుదల చేస్తామని చెప్పారు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?