బడా నిర్మాతలకు పాఠాలు నేర్పుతున్న వర్మ తెలివితేటలు

వందల కోట్ల బడ్జెట్ తో ఏళ్ల తరబడి ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తే ఆ నిర్మాతకు లాభాలు వస్తాయనే గ్యారంటీ లేదు. ప్లాప్ అయితే అంతే సంగతులు. ఒక వేళ ఆ మూవీకి హిట్ టాక్ వచ్చినా…హీరో, హీరోయిన్ మరియు డైరెక్టర్ రెమ్యూనరేషన్స్ విడుదల మరియు ప్రచార ఖర్చులు లెక్కేసుకుంటే మిగిలేది అరాకొరే. దీనికి పూర్తి విరుద్ధంగా..నెలరోజులో ఓ సినిమాను ముక్కు మొహం తెలియని నటులతో అతి తక్కువ బడ్జెట్ పూర్తి చేసి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల చేసి కోట్లు దండుకుంటున్నారు వర్మ.

ఆయన గత చిత్రం క్లైమాక్స్ బడ్జెట్ కి వచ్చిన వసూళ్లకు చాలా తేడా ఉంది అని వర్మ స్వయంగా ఒప్పుకున్నాడు. ఆ మూవీ వలన భారీ లాభాలు ఆర్జించినట్లు వర్మ మీడియా ముఖంగా తెలియజేశాడు. రక్తం మరిగిన పులిలాగా వర్మ కూడా అడల్ట్ కంటెంట్ వలన కురుస్తున్న కాసులను మరిగి వరుసగా అలాంటి చిత్రాలు చేస్తున్నాడు. క్లైమాక్స్ స్పూర్తితో ఆయన తెరకెక్కించిన మరో చిత్రం నగ్నం నేడు విడుదల కానుంది. టికెట్ రేటు 100 నుండి 200 రూపాయలు పెంచిన వర్మ భారీ లాభాలపై కన్నేశాడు.

క్లైమాక్స్ కి కొంచెం బడ్జెట్ కేటాయించిన వర్మ నగ్నం మూవీని లక్షల్లో పూర్తి చేశాడు. అది కూడా 5 లక్షల బడ్జెట్ లోపే అని తెలుస్తుంది. నగ్నంలో నటించిన స్వీటీకి ఆయన లక్ష రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే ఇచ్చాడట. ఇక దాదాపు ఓ ఇంటిలో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ మరియు నటులకు అయిన ఖర్చు చాలా తక్కువని తెలుస్తుంది. కాబట్టి వర్మ నగ్నం మూవీ ద్వారా మరో సారి డబ్బులు కొల్లగొట్టనున్నాడు. ఏదేమైనా వర్మ బుర్రకున్న తెలివితేటలు అద్బుతం అనాలి.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus