శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ‘లీడర్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది రిచా గంగోపాధ్యాయ. ఈమె నటించింది 9 సినిమాలే అయినప్పటికీ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ‘లీడర్’ తో పాటు ‘మిరపకాయ్’ ‘మిర్చి’ వంటి హిట్ సినిమాలు ఈమె ఖాతాలో ఉన్నాయి. నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఈమె నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా.. తమిళంలో ఈమె ధనుష్‌తో కలిసి నటించిన ‘మయక్కం ఎన్నా’ చిత్రం విడుదలై నేటితో తొమ్మిది ఏళ్ళవుతుంది. ఈ నేపథ్యంలో ఆమె ట్విటర్ వేదికగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
రిచా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ” ‘వావ్.. ‘మయక్కం ఎన్నా’ సినిమా వచ్చి అప్పుడే తొమ్మిదేళ్లు అవుతుందా. నమ్మలేకపోతున్నాను. నా డ్రీమ్స్ ను ఫుల్ ఫీల్ చేసుకోవడం కోసం రీల్ లైఫ్ అనే ఓ పేజీని రియల్‌లైఫ్ నుండీ తొలగించాల్సి వచ్చింది.నా లైఫ్ లో ఇప్పటివరకూ నాకే బాధలేదు. నటిగా రాణిస్తున్న టైంలోనే మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ వంటి వాటిలో శిక్షణ తీసుకోవాలనే ఆశ కలిగింది. అలా నేను ఎంబీఏ చెయ్యడం.. ఆ తరువాత నా క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడటం.. చివరికి అతన్నే పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. నటిగా ఇండియాలో మిస్ అయిన నా ఫ్రెండ్స్ ను ఎంబీఏ కారణంగా మళ్లీ కలుసుకోగలిగాను. సినిమాలు చెయ్యడం గొప్ప ఆలోచనే కానీ..
నా డ్రీమ్స్ ను ఫుల్ ఫీల్ చేసుకోవాలనేది అంతకంటే అద్భుతమైన నిర్ణయమని నేను భావిస్తున్నాను.జీవితంలో ప్రతిసారీ ఛాయిస్‌లుంటాయి. హార్డ్ వర్క్ చెయ్యండి. ఆ టైం వచ్చినప్పుడు మీ కలలన్నీ నిజమవుతాయి. మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. 24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాకున్న ఇష్టాలు, జీవన శైలికి ఇప్పుడు ఉన్న ఇష్టాలకు ఎన్నో మార్పులున్నాయి. అయినా సరే ఐ లవ్ మై లైఫ్. నా సినిమాలు చూసినందుకు, నాపై ప్రశంసల వర్షం కురిపించినందుకు థ్యాంక్యూ. నేను సినిమాలకు దూరమైనప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా నాపై అభిమానాన్ని చూపిస్తున్నందుకు మీ నా హార్ట్ ఫుల్ థాంక్స్. అతితక్కువ కాలంలోనే మాంచి విజయాన్ని సొంతం చేసుకున్నానంటే దానికి కారణం మీరే.!” అంటూ రిచా పేర్కొంది.
1
2
3
4
5
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?