టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ అప్పుడే మొదలైంది. నిన్న సాయంత్రం విశాల్ తనకు కాబోయే భార్యను ప్రపంచానికి ట్విట్టర్ ద్వారా పరిచయం చేసిన కొద్ది సమయంలోనే నటీమణి రిచా గంగోపాధ్యాయ కూడా తనకు కాబోయే భర్తని పరిచయం చేసింది. గత కొన్నాళ్లుగా జోయ్ అనే తన స్నేహితుడితో రిలేషన్ షిప్ లో ఉన్న రిచా త్వరలోనే అతడ్ని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వనుందట. ఈ విషయాన్ని నిన్న ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
రాణా సరసన “లీడర్” చిత్రంతో వెండితెరకు పరిచయమైన రిచా గంగోపాధ్యాయ తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రభాస్ సరసన నటించిన “మిర్చి”, నాగార్జున “భాయ్” ఆమె నటించిన ఆఖరి చిత్రాలు. ఈ సినిమాల తర్వాత ఎందుకో ఆమె ఇండస్ట్రీకి సడన్ గా గుడ్ బై చెప్పేసి అమెరికా వెళ్లిపోయింది. అక్కడ చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం సంపాదించుకొని సెటిల్ అయిపోయింది. అప్పట్లో ఆమె మళ్ళీ సినిమాల్లోకి వస్తుందని వార్తలొచ్చినప్పటికీ.. పెళ్లి కూడా ఫిక్స్ చేసుకోవడంతో ఆమె సినిమాల్లో ఇకమీదట కనిపించదు అనే విషయం స్పష్టమైంది.