రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లీడర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది రిచా గంగోపాధ్యాయ్. ఆ తర్వాత ఈమె ‘నాగవల్లి’ ‘మిరపకాయ్’ ‘సారొచ్చారు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే ప్రభాస్ తో చేసిన ‘మిర్చి’ చిత్రం ఈమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఆ మూవీలో ఆమె మానస అనే పాత్రని పోషించింది. ఈ మూవీ తర్వాత ఈమె కెరీర్ ఊపందుకుంటుంది అనుకుంటే అలా జరగలేదు.
నాగార్జున వంటి స్టార్ హీరో మూవీలో ‘భాయ్’ అనే మూవీ ఛాన్స్ ను దక్కించుకున్న ఈ బ్యూటీ ఆ మూవీతో పెద్ద డిజాస్టర్ ను మూటకట్టుకుంది.తర్వాత తమిళంలో సినిమాలు చేసినా అవి కలిసి రాలేదు. దాంతో ఉన్నత చదువుల కోసం ఈమె విదేశాలకు వెళ్లి 2019 లో తన క్లాస్ మేట్ జో లంగెల్లాను వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది. 2021 లో పండంటి మగబిడ్డకు ఈమె జన్మనిచ్చింది..! సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీచా తాజాగా తన భర్త, కొడుకుతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది.
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఫోటోల్లో రీచా గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఒకప్పుడు ఈమె మొహానికి ఇప్పటి మొహానికి సంబంధం లేదు. అయితే ఈమె కొడుకు మాత్రం చాలా క్యూట్ గా ఉన్నాడు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మరోపక్క ఈమెకు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!