Rishab Shetty, Jr NTR: ఎన్టీఆర్ పై కాంతార హీరో షాకింగ్ కామెంట్స్

తాజాగా సైమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం దుబాయ్ లో జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ నటుడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఈ అవార్డు వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ మరోసారి కన్నడ భాషలో మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరిచారు. ఎన్టీఆర్ దాదాపు 8 భాషలు మాట్లాడతారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని ఈ వేదికపై ఈయన కాంతార హీరో దర్శకుడు కన్నడ భాషలో మాట్లాడారు.

ఈ విధంగా వీరిద్దరూ కన్నడలో మాట్లాడుతున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ టాలెంట్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రిషబ్ శెట్టి అవార్డును అందుకొని వేదికపై నుంచి ఎన్టీఆర్ తో మాట్లాడుతూ ఎలా ఉన్నారు సార్ అని అడగగా ఎన్టీఆర్ కన్నడ భాషలో బాగున్నాను అంటూ సమాధానం చెప్పారు. సార్ మీరు కుందాపూర్ (కర్ణాటక) వచ్చినప్పుడు కూడా కన్నడలోనే మాట్లాడతారా అని అడిగితే మా అమ్మతో నేను కన్నడలోనే మాట్లాడతాను అంటూ ఎన్టీఆర్ సమాధానం చెప్పారు.

ఇక ఎన్టీఆర్ మాటలకు రిషబ్ శెట్టి  (Rishab Shetty)మాట్లాడుతూ నేను మీకు డైరెక్ట్‌గా థ్యాంక్స్ చెప్పే ఛాన్స్ దొరకలేదు. లాస్ట్ టైమ్ కిరాక్ పార్టీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ మీరే ఇచ్చారు.. అప్పటి నుంచి మాకు అనిపించేది ఒక్కటే మీ అమ్మగారి ఊరు.. మాది ఒకటే ఊరు.. అందు మీరు ఆంధ్ర వ్యక్తి అనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు మీరు ఒక కన్నడ వ్యక్తిగానే అనిపించేది అంటూ ఈ సందర్భంగా రిషబ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus