Kantara: ‘కాంతార’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన రిషబ్ శెట్టి.. వీడియో వైరల్!

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమాకి సీక్వెల్ గా ‘కాంతార: ఏ లెజెండ్ చాప్టర్-1’ రాబోతున్నట్టు మొదటి భాగం వచ్చినప్పుడే అనౌన్స్ చేశారు. మొదటి భాగాన్ని అతి తక్కువ బడ్జెట్లో తీశారు. రూ.16 కోట్లలో సినిమా కంప్లీట్ అయిపోయింది. బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. దీంతో రెండో భాగం పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో షూటింగ్ కి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. మొత్తానికి రెండో భాగం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.

Kantara

ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘ఇట్స్ ఏ ర్యాప్ ఆన్ కాంతార: ఏ లెజెండ్ చాప్టర్-1’ అంటూ చిన్న మేకింగ్ వీడియోని వదిలారు మేకర్స్. ‘నాకో కల ఉంది. ప్రపంచం మొత్తం మన మట్టి కథ తెలుసుకోవాలి. మన ఊరు, మన ప్రజలు, మన సంప్రదాయం గురించి చెప్పుకుంటూ.. నేను ఆ కలను వెంబడించడం ప్రారంభించినప్పుడు నా వెనుక వేలాది మంది ఉన్నారు. మూడేళ్ల కృషి, 250 రోజుల షూటింగ్.. ఎంత కష్టమైనా సరే, నేను నమ్మిన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఇది కేవలం సినిమా కాదు, ఒక శక్తి.” అంటూ రిషబ్ శెట్టి చెబుతున్నట్టు ఆ వీడియోలో ఉంది.

వీడియో గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. అక్టోబర్ 2న ‘కాంతార: ఏ లెజెండ్ చాప్టర్-1’ విడుదల కానున్నట్లు కూడా ఈ వీడియో ద్వారా స్పష్టం చేశారు. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘హోంబలే ఫిలింస్’ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. రిషబ్ శెట్టి ఇందులో డ్యూయల్ రోల్ పోషిస్తూండటం మరో విశేషంగా చెప్పుకోవాలి.కన్నడ, తెలుగు సహా మొత్తం 7 భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.

ఒక డిజాస్టర్‌.. ఒక హిట్‌.. సామ్‌ – నందిని ఇప్పుడేం చేస్తారో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus