Guppedantha Manasu August 21st: మీ పెళ్లెప్పుడంటూ రిషిని అడుగుతూ షాక్ ఇచ్చిన వసుధర!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… రిషి చక్రపాణి వద్దకు వెళ్లి ఎందుకో వసుధార చాలా డల్ గా ఉన్నారు కారణం ఏంటి అని అడగడంతో వసమ్మ గురించి మీకన్నా ఎక్కువగా ఆలోచించేవారు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు బాబు తనకు నీ జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చి ఉంటాయి అందుకే బాధపడి ఉంటుంది అయినా ఇందులో మీ తప్పులేదు. వసమ్మ మిమ్మల్ని చాలా గాయపరిచింది అంటూ చక్రపాణి చెబుతాడు ఇక రిషి వెళ్ళబోతూ ఉండగా చక్రపానికి ఏంజెల్ వచ్చిన విషయం గుర్తుకు వస్తుంది దాంతో పొద్దున ఏంజెల్ వచ్చిన విషయాన్ని రిషికి చెబుతాడు చక్రపాణి.

రిషి వెళ్లి ఏంజెల్ ను వసుధారను ఉదయం కలిసావా అంటూ అడుగుతారు. దాంతో ఏం తాను ఏమైనా రిషికి చెప్పి ఉందా అంటూ కంగారు పడుతుంది. ఎందుకు రిషి అడుగుతున్నావు అనడంతో ఉదయం నుంచి వసుధార చాలా మూడ్ ఆఫ్ లోఉన్నారు అందుకే ఏం జరిగిందో నేను నిన్ను అడుగుతున్నాను అని చెప్పడంతో తనకు ఎన్నో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నన్ను అడిగితే నాకు ఎలా తెలుస్తుంది అంటూ ఏంజెల్ చెబుతుంది. అసలేం జరిగింది అంటూ ఏంజెల్ ను రిషి అడగడంతో మా లేడీస్ కి ఎన్నో విషయాలు ఉంటాయి అవన్నీ మీకు చెప్పాల్సిన పనిలేదు అంటూ తనని భోజనానికి తీసుకెళ్తుంది.

మరోవైపు వసుధార ఏంజెల్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అంతలోపు చక్రపాణి భోజనం చేయడానికి రమ్మని చెప్పగా తనకు ఆకలిగా లేదని చెబుతుంది. అలాగే రిషి వచ్చి వెళ్లిన విషయం గురించి కూడా చక్రపాణి చెబుతాడు. దాంతో వస్తదార కళ్లనిండా నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉండటం చూసి చక్రపాణి కంగారు పడతాడు.ఏం జరిగిందని చెప్పగా ఏం లేదు నాన్న నాకు ఆకలిగా లేదు మీరు వెళ్లి భోంచేయండి అని చెప్పడంతో చక్రపాణి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రిషి సర్ కి నాకు మధ్య వచ్చిన ఈ కొంత దూరానికే నేను తట్టుకోలేక పోతున్నాను అలాంటిది నా రిషి సర్ నాకు శాశ్వతంగా దూరమవుతున్నారంటే ఎలా భరించేది భగవంతుడా ఎలాగైనా మా ఇద్దరినీ నువ్వే కలపాలి అంటూ ఏంజెల్ మాటలను గుర్తు చేసుకుంటూ వసుధర కుమిలిపోతూ ఉంటుంది.

మరోవైపు వసుధార ఎందుకు అలా ఉంది అని రిషి ఆలోచనలో పడతారు తను ఎందుకు అలా ఉందో ఎవరిని అడిగినా చెప్పడం లేదు అసలు ఏమైందో తెలుసుకోకపోతే నా మనసు మనసులో లేదు అంటూ భోజనం చేయకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఏంజెల్ పిలుస్తున్న వినిపించుకోడు. పూర్వకాలం ఋషులు ఒంటరిగా ఉండేకి ఇష్టపడేవారు. ఇప్పుడు జనాలలో ఉన్న రిషి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు అంటూ ఏంజెల్ అనుకుంటుంది. గదిలోకి వెళ్లిన రిషి వసుధార గురించి ఆలోచిస్తూ అసలు ఏం జరిగింది మేడం అంటూ మెసేజ్ చేస్తారు.

మీకు చెప్పుకోవడానికి ఇది కాలేజీ సమస్య కాదు సర్ అంటూ వసుధార మెసేజ్ చేస్తుంది. అయినా మన మధ్య ఏ సంబంధం ఉందని నా సమస్య చెప్పుకోవాలి అంటూ వసుధార మెసేజ్ చేస్తుంది.సాటి లెక్చరర్ గా మీకు ఏదైనా సమస్య వస్తే నేను సాల్వ్ చేస్తాను చెప్పండి అంటూ మెసేజ్ చేయగా వసుధార మీ పెళ్లెప్పుడు అంటూ మెసేజ్ చేయడంతో ఒక్కసారిగా రిషి షాక్ అవుతాడు.అసలు వసుధార నా గురించి ఏమనుకుంటుంది అంటూ ఆమెకు ఫోన్ చేస్తాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus