“దూరపు కొండలు నునుపు” సామెత ఊరికే పుట్టలేదు లెండి. ప్రపంచంలోని ప్రతి మనుషికి, ముఖ్యంగా మన తెలుగువాళ్ళకి, మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమా దర్శకనిర్మాతలకి ఈ సామెత సరిగ్గా సూట్ అవుతుంది. మనోళ్ళకి హైబ్రాబాద్ లో ఉన్న తెలుగు అందాలు నచ్చవు, ఎక్కడో బాంబే నుంచో, చెన్నై నుంచో లేక కేరళ నుంచో తెచ్చుకున్న అరువు అందాలే నచ్చుతాయి. అందుకే మన తెలుగు హీరోయిన్లందరూ ముందు తమిళం లేదా మలయాళంలో స్టార్ స్టేటస్ సంపాదించుకొన్నాకే తెలుగులో రాణించగలుగుతున్నారు. లేదంటే.. హీరోయిన్ ఫ్రెండ్ రోలో లేక అక్క-చెల్లి రోల్స్ కో ఫిక్స్ అయిపోవడమే గతి.
మన తెలుగమ్మాయిలు అంజలి, శ్రీదివ్యలు అలా స్టార్ లు అయినవారే. ఈ జాబితాలో రీతూవర్మ కూడా చేరింది. “పెళ్ళిచూపులు”తో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకొన్న రీతూకి తెలుగులో సరైన ఆఫర్లు దొరకలేదు. అందుకే.. ముందు తమిళంలో, ఆ తర్వాత మలయాళంలో ఆఫర్లు అందుకుంటూ స్టార్ డమ్ కి ఒక్కో మెట్టు సెట్ చేసుకుంటుంది. తాజాగా మలయాళ సూపర్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకొంది రీతువర్మ. కనీసం ఇప్పుడైనా మన తెలుగు సినిమా దర్శకనిర్మాతలు రీతూ టాలెంట్ ను గుర్తించి ఆమెకు సరైన అవకాశాలు అందిస్తారేమో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.