టీవీల్లో ఎంటర్టైన్మెంట్ షోలు చాలానే ఉన్నాయి. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు.. వంటి ఛానల్స్ లో కామెడీ షోలు, డ్యాన్స్ షోలు, సింగింగ్ షోలకు కొదువ లేదు. థియేటర్లలో కూడా దొరకని కామెడీ అంతా ఇక్కడే దొరుకుతుంటుంది. టి.ఆర్.పి ల విషయంలో కూడా ఈ షోలు చరిత్ర సృష్టిస్తున్నాయి. అందుకే ఈ షోలలో పాల్గొనే వారు కూడా బాగా ఫేమస్. సినిమాల్లో కూడా వీళ్ళకే ఎక్కువ అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. ఇక పండగలు ఈ టీవీ షోలలో హంగామా మామూలుగా ఉండదు.
కామెడీ షోలలో పాల్గొనే వారితో పాటు సీరియల్స్ లో నటించే వారు కూడా ఒక్క చోట చేరిపోయి సందడి చేస్తుంటారు. ఈ క్రమంలో తెలంగాణలో బోనాల జాతర మొదలైన సందర్భంగా బోనాల సెలబ్రేషన్స్‌ను షురూ చేసింది జీ తెలుగు యూనిట్. ‘జీ తెలుగు వారి జాతర’ పేరుతో ఓ షోని సందడి చేసింది. ఇందులో జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్ లోని నటీనటులు , కమెడియన్స్, సింగర్స్ అంతా ఒక్కచోట చేరి నెవర్ బిఫోర్ అనే రేంజ్లో సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు.
జూలై 23న ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక్కో ప్రోమోను విడుదల చేస్తూ వస్తుంది జీ యూనిట్. ఇందులో కమెడియన్ రియాజ్ తన భార్యతో కలిసి స్టేజ్‌పైకి వచ్చాడు. ఈ ప్రోమోలో రియాజ్, తన భార్య పేరును రివీల్ చేయడం జరిగింది. రియాజ్ భార్య తన పేరు ‘యాస్మిన్’ అనగా.. కాదు, ‘యాస్మిన్ రియాజ్’ అని సద్దామ్ అనడంతో రియాజ్ సిగ్గుపడడం మనం గమనించవచ్చు.
అలాగే సద్దామ్, రియాజ్ లలో ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తారని యాంకర్ శ్రీముఖి రియాజ్ భార్యని అడగగా.. ‘రియాజ్’ అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.