Bigg Boss Telugu OTT: అషూ రెడ్డి ముఖంపై నీళ్లు ఉమ్మిన చైతూ కారణం ఇదే!

బిగ్ బాస్ హౌస్ లో వారియర్స్ కి ఛాలెంజర్స్ కి మద్యన టాస్క్ అనేది మొదలైంది. ఇందులో భాగంగా వారియర్స్ నుంచీ ఇంటి పనులు చేసేందుకు చెఫ్, హౌస్ కీపీంగ్, మేనేజర్ గా కొంతమందిని ఎన్నుకోమని బిగ్ బాస్ ఛాలెంజర్స్ కి చెప్పాడు. అంతేకాదు, వారియర్స్ ఏదైనా పని చేయాలన్నీ, వారికి కావాల్సిన బట్టలు వేసుకోవాలన్నా, తిండి తినాలన్నా, బెడ్ రూమ్ లో పడుకోవాలన్నా కూడా ఛాలెంజర్స్ పై ఆధారపడి ఉండాలి.

ఎవరైతే యాక్సెస్ పొందిన ఛాలెంజర్ ఉంటారో వారు కనికరిస్తేనే వారియర్స్ హౌస్ లో సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇందుకోసం ముందుగా వారియర్స్ ని ఇంటర్య్వూ చేసి ఉద్యోగాలు ఇచ్చారు ఛాలెంజర్స్. ముమైత్ ఖాన్ ని వారియర్స్ కి మేనేజర్ గా నియమించారు. ఇక్కడే వారియర్స్ అందర్నీ ఇంటర్య్వూ చేస్తూ కాసేపు హౌస్ మేట్స్ సందడి చేశారు. ఇంటర్య్వూలో ముమైత్ ఖాన్ ని మేనేజర్ గా, అఖిల్ , అరియానా, తేజస్విని, నటరాజ్ మాస్టర్స్ ని చెఫ్ లుగా నియమించారు.

మహేష్ విట్టా, అషూరెడ్డి, హమీదా,సరయులని హౌస్ కీపింగ్ సెషన్స్ లో నియమించారు. కాసేపు అషూరెడ్డికి పనులు చెప్తూ యాంకర్ చైతూ ఆటపట్టించాడు. అషూని వాటర్ బాటిల్ తీస్కుని రమ్మని నీళ్లు తాగించమని చెప్పాడు. దీంతో అషూ రెడ్డి వాటర్ చైతూకి తాగిస్తున్న టైమ్ లో వాటర్ ఫ్లో ఎక్కువై చేతూ బయటకి ఉమ్మేశాడు. ఆ నీళ్లు అషూరెడ్డిపైన పడ్డాయి. దీంతో అషూ రెడ్డి సరదాగా అక్కడ ఇష్యూ చేసింది. మేనేజర్ కి కంప్లైట్ చేస్తూ రెచ్చిపోయింది.

ఇదంతా సరదాగా చేసినా కూడా ఇందులో అషూరెడ్డి కొద్దిగా సీరియస్ అయ్యిందా అని అనిపించింది. మొదటి వారం నామినేషన్స్ లో భాగంగా ఛాలెంజర్స్ ఒక్కొక్కరు ఇద్దరు వారియర్స్ ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు మొదటివారం నామినేషన్స్ లోకి రాబోతున్నారు. అదీ విషయం.

[yop_poll id=”9″]

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus