సీనియర్ హీరోయిన్ శోభన అందరికీ సుపరిచితమే. 1984 లో సుమన్ హీరోగా వచ్చిన ‘శ్రీమతి కానుక’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శోభన. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా రూపొందిన ‘అజేయుడు’, ‘త్రిమూర్తులు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవితో ‘రుద్రవీణ’ , బాలకృష్ణ తో ‘మువ్వగోపాలుడు’, నాగార్జునతో ‘విక్రమ్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వంటి అప్పటి టాప్ హీరోల సినిమాల్లో కూడా ఈమె నటించింది.
తెలుగులో ఇంకా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది. ఈమె భారత నాట్యంలో కూడా మంచి ప్రావిణ్యం సంపాదించిన దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి పాపులర్ అయ్యింది. ఇప్పటికీ ఎన్నో ప్రదర్శనలు ఇస్తూనే ఉంది. మలయాళం నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇదిలా ఉండగా.. శోభన ఇల్లు చెన్నైలోని శ్రీమాన్ శ్రీనివాస కాలనిలో ఉంది. ఆమె ఇల్లు రెండంతస్తుల భవనం. పై పోర్షన్ లో శోభన (Shobana) తన తల్లితో కలిసి ఉంటుంది.
ఆమెకు పెళ్లి కాలేదు అనే సంగతి తెలిసిందే. అది వేరే విషయం అనుకోండి.! ఇక క్రింది పోర్షన్లో డాన్స్ స్కూల్ నడుపుకుంటుంది శోభన. ఇదిలా ఉండగా.. ఆమె తల్లి వృద్ధురాలు కాబట్టి ఆమెకి సహాయంగా కడలూరుకి చెందిన విజయ అనే వ్యక్తిని పనిమనిషిగా పెట్టుకుంది. ఈ క్రమంలో కొన్నాళ్లుగా శోభన తల్లి వద్ద ఉన్న డబ్బు మిస్ అవుతుంది. ఆమె డబ్బు కాజేస్తుంది పని మనిషేమో అని శోభనకి డౌట్ వచ్చింది.
తర్వాత పోలీసులు ఎంటర్ అయి గట్టిగా ప్రశ్నించగా విజయ నిజం చెప్పేసింది. దాదాపు 41 వేలు ఆమె దొంగిలించినట్టు తెలుస్తుంది. ఆమె పై పోలీసులు కేసు పెట్టడానికి రెడీ అయితే ఆమె కష్టాలు, అవసరాలు తెలుసుకుని శోభన.. ఆమె తీసుకున్న డబ్బుని జీతం నుంచి కట్ చేస్తానని చెప్పి ఆమెను మందలించి వదిలేసింది. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయొద్దని అవసరం అయితే తనని అడగమని తప్పకుండా ఇస్తానని చెప్పి ఆ పని మనిషిని క్షమించి మళ్ళీ పనిలో పెట్టుకుంది.
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!