‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు’ అని మన పెద్దవాళ్ళు చెప్పే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా అలానే ఈ మధ్య వరుసగా కన్నడ సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. ఏదో కె.జి.ఎఫ్ సినిమా హిట్టయ్యింది కదా.. అని ప్రతీ కన్నడ సినిమాని తెలుగు ప్రేక్షకులు చూసేస్తారు అని భావించో ఏంటో కానీ.. వరుసగా అక్కడి మేకర్స్ తమ సినిమాలను తెలుగులో డబ్ చేసేస్తున్నారు. ఇప్పటికే ‘పహిల్వాన్’ ‘అతడే శ్రీమన్నారాయణ’ ‘పొగరు’ వంటి సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. తాజాగా మరో కన్నడ డబ్బింగ్ సినిమా అయిన ‘రాబర్ట్’ కూడా ఇటీవల తెలుగులో డబ్ అయ్యి ఘోరపరాజయాన్ని చవి చూసింది. ట్రైలర్ హిట్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం అలరిస్తుంది అని భావించి ఇక్కడి బయ్యర్స్ ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేశారు. మార్చి 11న శివరాత్రి పండుగ రోజున విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది.
ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం
0.11 cr
సీడెడ్
0.05 cr
ఉత్తరాంధ్ర
0.03 cr
ఈస్ట్
0.02 cr
వెస్ట్
0.01 cr
కృష్ణా
0.02 cr
గుంటూరు
0.02 cr
నెల్లూరు
0.01 cr
ఏపీ+తెలంగాణ టోటల్
0.27 cr
‘రాబర్ట్’ తెలుగు హక్కులను 1.5 కోట్లకు కొనుగోలు చేశారు. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం 0.27 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలిందనే చెప్పాలి.