లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కు డేట్స్ ఇవ్వలేవా అనసూయ?

  • July 25, 2022 / 06:47 AM IST

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఇలా సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో బిజీ అయిన వారిలో యాంకర్ అనసూయ ఒకరు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ త్వరలోనే ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పబోతున్నారు. గత కొద్దిరోజుల నుంచి ఈ కార్యక్రమానికి అనసూయ దూరమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా అనసూయ జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్ళిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే వేదికపై ఈ విషయాన్ని స్కిట్ రూపంలో తెలియజేశారు. అనసూయ చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే తన పిల్లలను తన అమ్మ చేతిలో పెట్టి ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇలా నీకు లైఫ్ ఇచ్చిన ఈ కార్యక్రమానికి డేట్స్ లేవా అనసూయ అంటూ ప్రశ్నించారు. ఈ విధంగా ఈమె వెళ్ళిపోతారని ఈ స్కిట్ ద్వారా తెలియచేయడంతో అక్కడున్నటువంటి కంటెస్టెంట్లు జడ్జిలు అలాగే అనసూయ సైతం ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

స్కిట్ అనంతరం చలాకి చంటి మాట్లాడుతూ నెలలో మూడు రోజులు ఈ కార్యక్రమం కోసం కేటాయించలేవా అని ప్రశ్నించగా రాకెట్ రాఘవ మాట్లాడుతూ.. ఎవరొచ్చినా వెళ్లిపోయిన జబర్దస్త్ కార్యక్రమం అనేది ఆగదు.ఈ కార్యక్రమానికి కొత్తవాళ్లు వస్తుంటారు అలాగే వెళుతుంటారు అయినా ఇదిలాగే కొనసాగుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇకపోతే అనసూయకు వచ్చేవారమే చివరి జబర్దస్త్ కార్యక్రమం ఎపిసోడ్ అని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ప్రోమో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక అనసూయ వెళ్ళిపోతుందని తెలియడంతో ఇంద్రజ కన్నీటి పర్యంతరం అయ్యారు. ఈ క్రమంలోనే వేదిక పైకి వచ్చి అనసూయను హగ్ చేసుకుని నిజంగానే ఈ జబర్దస్త్ కార్యక్రమం నిన్ను ఎంతో మిస్ అవుతుంది అంటూ ఆమె ఎమోషనల్ గా కంటతడి పెట్టుకున్నారు. మొత్తానికి ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus