ఒకప్పుడంటే సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేవరకు పెద్దగా ఎవరికీ తెలిసేవి కావు.. సోషల్ మీడియా కారణంగా సెలబ్స్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌ని ఫాలో అయితే చాలు.. వాళ్ల పర్సనల్ విషయాలు కూడా తెలిసిపోతాయి.. రీసెంట్‌గా సీనియర్ నటి రోహిణి మొల్లేటి పెట్టిన ఓ పోస్ట్ నెటిజన్లను, తెలుగు ప్రేక్షకులను భావోద్వాగానికి గురి చేస్తుంది.. డిసెంబర్ 11న వెర్సటైల్ యాక్టర్ రఘవరన్ జయంతి.. 1958 డిసెంబర్ 11న కేరళలోని కొల్లెంగోడ్‌లో జన్మించారాయన..
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లోనే పాన్ ఇండియా యాక్టర్ రఘవరన్.. ప్రతినాయక పాత్రలకు పెట్టింది పేరు. ‘పసివాడి ప్రాణం’, ‘శివ’, ‘బాషా’, ‘సుస్వాగతం’,‘మాస్’ .. ఇలా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సూపర్ హిట్ సినిమాలలో అద్భుతమైన పాత్రలు పోషించి మెప్పించారు.. విలన్ అంటే రఘువరన్.. విలనిజం అంటే రఘవరన్‌దే అన్నంతగా చెరుగని ముద్ర వేశారు.. ఆయన తెలుగులో చివరిగా నితిన్ నటించిన ‘ఆటాడిస్తా’ మూవీలో కనిపించారు..
కళ్లతోనే హావభావాలు పలికించడం.. డిఫరెంట్ వాయిస్‌తో భయపెట్టడం ఆయనకే సాధ్యం.. పలు విజయవంతమైన చిత్రాలలో విభిన్న పాత్రలతో ఆకట్టుకున్నారు.. రఘువరన్ 64వ జయంతి సందర్భంగా ఆయన భార్య, (మాజీ అని చెప్పాలి.. ఎందుకంటే ఆయన చనిపోయేనాటికి వీరిద్దరూ విడిపోయారు) సీనియర్ నటి రోహిణి ఓ అరుదైన ఫోటోను షేర్ చేస్తూ ‘రఘ…’ అని కామెంట్ చేశారు.
ఆయన మీద ఉన్న అంతులేని ప్రేమను, ఆయన లేకుండా గడుస్తున్న కాలాన్ని గురించి వివరించి చెప్పడానికి మాటలు రాక, చాలక.. భావోద్వేగంతో ఆమె ఈ ట్వీట్ చేశారు.. నెట్టింట రోహిణి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.. 1996లో వీరి పెళ్లి జరిగింది.. 2000 సంవత్సరంలో ఓ బాబు పుట్టాడు.. 2004లో విడాకులు తీసుకున్నారు.. 2008 మార్చి 19న తన 49వ ఏట రఘువరన్ కన్నుమూశారు.. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నారు..
Raghu… pic.twitter.com/6dzbdRZAAH
— Rohini Molleti (@Rohinimolleti) December 10, 2022
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!