రోజా కూతురితో ఫ్రెండ్షిప్ చేస్తున్న శేఖర్ మాస్టర్ కూతురు.. ఫోటో వైరల్!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సుమారు 200కు పైగా సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోజా అనంతరం రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా రాజకీయాలలో కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా తనకంటూ ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇక ఈమె ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో కూడా బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే బుల్లితెర కార్యక్రమాల్లోను అలాగే స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శేఖర్ మాస్టర్ గురించి మనకు తెలిసిందే.

ఈయన ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా సెలెబ్రిటీల పిల్లలు చాలా వరకు మంచి స్నేహితులుగా మెలుగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే రోజా కూతురు అన్షు మాలిక ఎంతో నైపుణ్యం గల అమ్మాయి అనే విషయం మనకు తెలిసిందే.తల్లి బాటలోనే ఈమె కూడా ఇంత చిన్న వయసులో ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ పెద్దఎత్తున వార్తల్లో నిలిచారు.

అదేవిధంగా శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ పలు డాన్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇలా వీరిద్దరూ ఇంత చిన్న వయసులోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ స్నేహితులుగా మారినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కుటుంబం అలాగే మంత్రి రోజా కుటుంబం దుబాయ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి దుబాయ్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1

2

3

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus