Roja Ramani: తరుణ్ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రోజా రమణి.. ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో తరుణ్ (Tarun Kumar) ఒకరనే సంగతి తెలిసిందే. తరుణ్ వయస్సు ప్రస్తుతం 41 సంవత్సరాలు కాగా ఈ హీరో పెళ్లికి సంబంధించిన శుభవార్త ఎప్పుడు చెబుతారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తరుణ్ తల్లి రోజా రమణి ఒక ఇంటర్వ్యూలో తరుణ్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా ఇంట్లో వాళ్లకు చికెన్ ఇష్టమని నేను ఎగ్ కూడా తిననని ఆమె అన్నారు.

తరుణ్ పై వచ్చిన రూమర్స్ లో ఏ మాత్రం నిజం లేదని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని రోజా రమణి పేర్కొన్నారు. రూమర్స్ కూడా ఎవరికైతే మంచి గుర్తింపు, పాపులారిటీ ఉందో వాళ్ల గురించి రాస్తారని ఆమె తెలిపారు. నిజం ఏంటో మనకు తెలుసని రోజా రమణి అన్నారు. తరుణ్ కు సినిమాల్లో కంటే రియల్ లైఫ్ లో ఎక్కువ పెళ్లిళ్లు చేశారని ఆమె కామెంట్లు చేశారు.

ఆ వార్తలను చూసి నవ్వుకోవడం తప్ప ఏమీ ఉండదని రోజా రమణి అన్నారు. తరుణ్ ఏ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటారని రాశారో వాళ్లు నాకు పరిచయం ఉన్న హీరోయిన్లు అని ఆమె తెలిపారు. తరుణ్ పెళ్లి అతని ఇష్టమని రోజా రమణి అన్నారు. పెళ్లి చేయడం మన బాధ్యత అని వాళ్లకు నచ్చిన అమ్మాయిని మనం చూసి చేస్తామని ఆమె పేర్కొన్నారు. నేను సినిమాలను ఎంతో ఇష్టంగా చూస్తానని రోజా రమణి వెల్లడించారు.

బాహుబలి2 (Baahubali 2) సినిమాను చివరిగా థియేటర్ లో చూశానని ఆమె పేర్కొన్నారు. మలయాళం సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూశానని ఆమె అన్నారు. తరుణ్ సినీ రంగానికి కూడా దూరంగా ఉన్నారు. తరుణ్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తరుణ్ కెరీర్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయో తెలియాల్సి ఉంది. తరుణ్ ను ఈ జనరేషన్ యూత్ సైతం ఎంతో అభిమానిస్తారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus