Roja: బ్రాహ్మణిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే రోజా.. అసలేం జరిగిందంటే?

వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో విమర్శల విషయంలో వేడి పెంచారు. తాజాగా బ్రాహ్మణిపై రోజా తీవ్రస్థాయిలో విమర్శలు చేయగా ఆ విమర్శలు హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన రోజా బ్రాహ్మణి తెలియక మాట్లాడుతున్నారా? తెలిసీ అబద్ధాలు చెబుతున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు స్కాంలో దొరికిపోయి జైలులో ఉన్నారని ఆమె అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా భువనేశ్వరి. బ్రాహ్మణి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని రోజా తెలిపారు.

గంట కొట్టాలని విజిల్స్ వేసి జగన్ కు బుద్ధి చెప్పాలని వాళ్లు ఎలా అంటున్నారని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రజల సొమ్ము తిన్నారని రోజా కామెంట్లు చేశారు. ఏపీలో పెద్ద సైకోలు బాలయ్య, చంద్రబాబు అని రోజా కామెంట్లు చేశారు. సీఎం జగన్ గురించి మాట్లాడితే బ్రాహ్మణికి మర్యాద దక్కదని రోజా చెప్పుకొచ్చారు.

ఇన్నిరోజులు బ్రాహ్మణి పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు కాబట్టి నేను ఆమె గురించి మాట్లాడలేదని రోజా కామెంట్లు చేశారు. హైదరాబాద్ కే పరిమితమైన బాబు కుటుంబాన్ని మళ్లీ ఆంధ్రప్రదేశ్ లోకి రాకుండా చేస్తారని రోజా చెప్పుకొచ్చారు. రోజా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజా 2024 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రోజాకు మళ్లీ మంత్రి పదవి వస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రోజా చేస్తున్న విమర్శలపై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. రోజా రాబోయే రోజుల్లో పొలిటికల్ గా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. రోజాకు అనుకూల పరిస్థితులు లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. రోజాపై సోషల్ మీడియాలో నెగిటివిటీ మాత్రం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రోజా సినిమాల్లోకి రాబోయే రోజుల్లో రీఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus