Roja, Pawan Kalayn, Nani: పవన్, నానిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే రోజా!

ప్రముఖ సినీ నటి, ఎమ్మెల్యే రోజా టాలీవుడ్ టికెట్ రేట్ల గురించి, నాని చేసిన కామెంట్ల గురించి స్పందిస్తూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. హీరో నాని ఏపీ థియేటర్ల కలెక్షన్లతో పోలిస్తే కిరాణా కొట్ల కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. నాని చేసిన కామెంట్ల గురించి వైసీపీ ఎమ్మెల్యేలు ధీటుగా బదులిచ్చారు. టికెట్ల ధరలు తగ్గించడం అంటే ప్రేక్షకులను అవమానించినట్టే అని నాని చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.

అయితే నాని చేసిన వ్యాఖ్యలను వివాదం చేయవద్దని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కోరారు. నాని వ్యాఖ్యల గురించి ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ సీఎం జగన్ పేదలకు మంచి జరగాలని ఆలోచిస్తారని పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాల గురించి కూడా ఆలోచించాలని ఆమె అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమస్యలను పరిష్కరిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. థియేటర్లతో పోలిస్తే కిరాణా కొట్టు బిజినెస్ బాగుంటే ఆ బిజినెస్ చేసుకోవాలని రోజా నానికి సూచనలు చేశారు.

నాని చేసిన వ్యాఖ్యల వల్ల ఇండస్ట్రీకి మరింత నష్టం జరుగుతుందని రోజా కామెంట్లు చేశారు. కొందరి నోటి దురద వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ లా జరిగాయని రోజా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రోజా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా పవన్ పై కూడా ఫైర్ అయ్యారు. రాజకీయ పార్టీ పెట్టి సినిమాలు తీస్తున్న వ్యక్తి వల్ల ఈ విధంగా జరుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు.

సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎవరికి తోచినట్టుగా వాళ్లు చేస్తున్న కామెంట్ల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని రోజా అన్నారు. ప్రభుత్వం దగ్గరకు వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం ఎప్పుడూ చర్చలకు సిద్ధమేనని రోజా చెప్పుకొచ్చారు. రోజా చేసిన కామెంట్ల గురించి నాని, పవన్ స్పందిస్తారా? లేదా? చూడాల్సి ఉంది. రోజా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus