Roja: కొత్త కారుపై ట్రోల్స్.. రోజా షాకింగ్ ఆన్సర్ ఇదే!

వైసీపీ మంత్రి, సినీ నటి రోజా మంత్రి అయిన తర్వాత సినిమాలకు, టీవీ షోలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోజా వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. తనపై ఎవరైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలకు రోజా ఘాటుగా స్పందించి జవాబులు ఇస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రోజా కొత్త కారును కొనుగోలు చేయగా ఆ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే అక్రమంగా సంపాదించిన డబ్బుతో రోజా కొత్త కారును కొనుగోలు చేశారని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ఆ విమర్శల గురించి రోజా స్పందిస్తూ తనదైన శైలిలో బదులిచ్చారు. తాను 150 కంటే ఎక్కువ సినిమాలలో నటించానని రోజా వెల్లడించారు. జబర్దస్త్ షోకు ఎన్నో సంవత్సరాల పాటు జడ్జిగా ఉన్నానని రోజా చెప్పుకొచ్చారు. అక్కడ నేను లక్షల్లో పారితోషికం తీసుకున్నానని ఆమె అన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం అని రోజా కామెంట్లు చేయడం గమనార్హం.

అవసరం అనుకుంటే నేను చెల్లించే ఆదాయపు పన్నుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చని రోజా చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు నాపై బురద చల్లుతున్నాయని రోజా వెల్లడించారు. జబర్దస్త్ షోకు భారీస్థాయిలో పారితోషికం అందుకున్నానని రోజా అన్నారు. రోజా ప్రతిపక్ష పార్టీల నేతల ప్రశ్నలకు ధీటుగా జవాబు ఇవ్వడంతో వాళ్లు సైలెంట్ అవుతారేమో చూడాల్సి ఉంది.

రోజా స్థిర, చరాస్థులు 8 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. గత కొన్నేళ్లుగా రోజా సినిమాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. పిల్లలకు బెనిఫిట్ కలగాలనే ఉద్దేశంతో లక్షల రూపాయలు ఆమె పిల్లల పేర్లపై ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని తెలుస్తోంది. రోజా కొత్త కారు కొనడంలో ఆశ్చర్యం ఏముందని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రోజురోజుకు రోజాకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus