‘రౌడీ బేబీ’ సాంగ్ పోస్టర్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సాయి పల్లవి కలిసి నటించిన ‘మారి 2’ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇటీవల యూట్యూబ్ లో ఏకంగా వంద కోట్ల వ్యూస్ ని సాధించి సత్తా చాటింది. ఇప్పటివరకు సౌత్ ఇండియాలో ఏ పాటకి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో చిత్రనిర్మాణ సంస్థ ఈ పాటకి సంబంధించిన ఓ కామన్ డీపీని షేర్ చేసింది. ఇప్పుడు ఆ పోస్టర్ వివాదానికి దారి తీసింది. నెటిజన్లు చిత్రయూనిట్ పై ట్రోల్స్ చేస్తున్నారు.

ఇంతకీ ఈ వివాదం దేనికంటే.. ఈ పోస్టర్ లో కేవలం ధనుష్ ఫోటో మాత్రమే కనిపించడం. నిజానికి ఈ పాట ఇంత పెద్ద సక్సెస్ కావడం మ్యూజిక్ తో పాటు ప్రభుదేవా కొరియోగ్రఫీ కూడా. ఈ పాటలో ధనుష్ కంటే హీరోయిన్ సాయి పల్లవి తన స్టెప్పులతో రచ్చ చేసింది. బేసిక్ గా సాయిపల్లవి మంచి డాన్సర్. హీరోలతో పోటీ పడి మరీ డాన్స్ లు వేస్తుంటుంది. రౌడీ బేబీ పాటలో ధనుష్ కంటే సాయి పల్లవి స్టెప్పులు హైలైట్ గా నిలిచాయి.

అయితే పోస్టర్ లో మాత్రం సాయిపల్లవి ఫోటో వేయకుండా ఒక్క ధనుష్ ఫోటో మాత్రమే వేయడంతో అభిమానులు హర్ట్ అయ్యారు. చిత్రనిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిం బ్యానర్ పై సీరియస్ గా కామెంట్స్ చేస్తున్నారు. సాయి పల్లవి ఫోటోని కావాలనే వేయలేదని.. ఇండస్ట్రీలో ఆమె అంటే భయం పట్టుకుందని.. కావాలని ఆమెని అణగదొక్కడానికి ఇలా చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరి ఈ విమర్శలపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి!

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus