ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్… ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రారంభమై 3 ఏళ్ళు దాటింది. రెండేళ్ళకి ఈ సినిమాలు విడుదలవుతాయి అనుకుంటే… కరోనా మరో ఏడాదిన్నర ఆలస్యం అయ్యేలా చేసింది. మొత్తానికి 2022 సంక్రాంతి కానుకగా ఈ రెండు చిత్రాలు విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ రెండు సినిమాల చూపు ఇప్పుడు జనవరి 2 పై పడింది. అంటే ఆ రోజున ఈ రెండు సినిమాలలో ఒకటి విడుదల అవుతుంది అని కాదు.
ఆ రోజు ఈ చిత్రాలు విడుదల పై ఓ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కొద్దిరోజులుగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా నార్త్ లో పరిస్థితి అంత బాగోలేదు. పరిస్థితి చెయ్యి దాటిపోక మునుపే కర్ఫ్యూ విధించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. 31st, న్యూ ఇయర్… కి జనాలు ఎక్కువ గుమికూడతారు. అలా జరిగితే కేసులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి.. జనవరి 2 న ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
షాపింగ్ మాల్స్, థియేటర్ల పై ఆంక్షలు విధించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అలా జరిగితే.. థియేటర్ల సీటింగ్ 50 శాతానికి కుదించే అవకాశం ఉంది. అంతేకాదు నైట్ కర్ఫ్యూ లు కూడా విధించే అవకాశం పుష్కలంగా ఉంది. అప్పుడు ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ లు విడుదలవ్వడం కష్టమే.ఎందుకంటే ఈ సినిమాలకి నార్త్ కలెక్షన్లు చాలా కీలకం. ఏపిలో వీటి లెక్కలు ఎక్కువ నమోదయ్యే అవకాశం లేదు. కాబట్టి.. నార్త్ లో పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే సినిమా రిలీజ్ అవుతాయి లేదంటే చాలా కష్టం.అందుకే జనవరి 2 పైనే వీటి భవిష్యత్తు ఆధారపడి ఉంది.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!