RRR Promotions: షర్టులపై ఆర్‌ఆర్‌ఆర్‌… ఎన్ని రెడీ చేశారంటారు!

రాజమౌళి సినిమా ఎంత భారీగా ఉంటుందో… ఆయన ప్రచార శైలి కూడా అంతే భారీగా ఉంటుంది. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో హీరోను ఆకాశం నుండి స్టేజీ మీదకు దింపడం చూశాం. అది ‘బాహుబలి’ విషయంలో జరిగింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి అయితే గెస్ట్‌ సల్మాన్ ఖాన్‌ కోసం అలాంటి ఏర్పాటు చేశారుని అని తెలుస్తుంది. అయితే ఇదంతా భారీతనం గురించి మాట్లాడటానికి… రాజమౌళి ప్రచార శైలి చూస్తే కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా కనిపిస్తాయి.

ఇలా కూడా ప్రచారం చేయొచ్చా అని కొందరికి అనిపిస్తే… ఇంకొందరికి దీని కోసం చాలా కష్టపడుతున్నారు అనిపిస్తుంది. అంతేకాదు దీని కోసం రాజమౌళి ఎంతగా ఆలోచించారు, ఎంత ప్లాన్‌ వేశారు అనేది కూడా తెలుస్తుంది.‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం చిత్రబృందం ముంబయిలో ఉంది. ఈ సినిమా ప్రచారాన్ని అక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం స్పెషల్‌ ఈవెంట్‌ను పూర్తి చేసుకున్నారు. సోమవారం టీమ్‌ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఈవెంట్లు చూస్తే… రాజమౌళి, రామ్‌చరణ్‌, తారక్‌… చొక్కాల విషయంలో ఓ కామన్‌ పాయింట్‌ కనిపిస్తుంది.

అదే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంబ్లమ్‌. వాళ్లు ఎలాంటి చొక్కా వేసుకున్నా, జర్కిన్‌ వేసుకున్నా, కోట్‌ వేసుకున్నా దాని మీద ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లోగో ఉండాల్సిందే, ఉంది కూడా. ఇలాంటి ఆలోచన చేయడం రాజమౌళికి కొత్తేం కాదు ‘బాహుబలి’ విషయంలో ఇదే పని చేశారు. సినిమా ప్రచారంలో టీమ్‌ మొత్తం ఇలాంటి ‘బాహుబలి’ లోగో ఉన్న దుస్తులే వేసుకున్నారు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ కూడా ఇదే పని చేస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసం ఇప్పటివరకు ఓ ఐదారు ప్రెస్‌మీట్లు పెట్టి ఉండొచ్చు.

మీటింగ్‌, మీటింగ్‌కి తారక్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి డ్రెస్సులు మారుతున్నాయి. వేసిన కొత్త డ్రెస్‌ మీద ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లోగో పక్కాగా ఉంటోంది. అసలు ఎన్ని డ్రెస్‌ల మీద రాజమౌళి టీమ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లోగోలు వేసింది అనేదే ఇక్కడ ప్రశ్న. అందాజ్‌గా లెక్కేసుకున్నా సినిమా విడుదల (జనవరి 7) వరకు చూసుకుంటే మరో 20 ప్రెస్‌ మీట్లు/ ఇంటర్వ్యూలు ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి మరో 20 చొక్కాలు అవసరం. మొత్తంగా 60 కావాలి.

ఈ లెక్కన రాజమౌళి టీమ్‌… ఇంకా చొక్కాలకు ‘లోగోలు’ కుట్టిస్తూనే ఉంటుంది. ఇక సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చే ప్రతి టీమ్‌ మెంబర్‌కు లోగో ఉన్న చొక్కానే ఇస్తారు. కాబట్టి మరో 100 డ్రెస్‌లు అవసరం అవుతాయి. అదన్నమాట లెక్క.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus