60కోట్ల బంగ్లా కొనేసిన ఆర్ఆర్ఆర్ స్టార్

ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోవడంతో కొంతమంది దాన్ని అడ్వెంటేజ్ గా తీసుకుంటున్నారు. భవిష్యత్తుపై అవగాహనతో కాస్త ఎక్కువ ఖర్చయినా పరవాలేదు అని ఖరీదైన బంగ్లాలను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ముంబై నగరంలో గత ఏడాది నుంచి రీయల్ ఎస్టేట్ దందాలో పెరుగుదల లేదు. అయినప్పటికీ కొంతమంది సినీ నటీనటులు భారీగా పెట్టుబడులు పెడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల అమితాబ్ బచ్చన్ అంధేరిలో 5,184 చదరపు అడుగుల అపార్ట్మెంట్ ను రూ.31 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు మరొక స్టార్ నటుడు కూడా అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టి కొత్త బంగ్లా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముంబైలోని కాస్ట్లీ ఏరియా అయినటువంటి జుహు ప్రాంతంలో ఆర్ఆర్ఆర్ స్టార్ అజయ్ దేవ్ గన్ 60కోట్లతో ఆ ప్రాపర్టీని సొంతం చేసుకున్నట్లు సమాచారం. గత ఏడాది నుంచి అజయ్ దేవ్ గన్ ఇలాంటి బంగ్లా కోసమే ఎదురుచూస్తున్నాడట. మొత్తానికి ఇష్టపడి భారీ పెట్టుబడితో ఆ ఆస్తిని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక అజయ్ దేవ్ గన్ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో అజయ్ పాత్ర చాలా కీలకమైందట. అలాగే బాలీవుడ్ లో మైదాన్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే ఈ సినిమాలు దాదాపు ఒకేసారి విడుదల అయ్యేవి.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus