ప్రేక్షకులు 4 ఏళ్లుగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ‘బాహుబలి'(సిరీస్) రికార్డులను తిరగరాసే సత్తా ఈ మూవీకి మాత్రమే ఉందని అంతా బోలెడంత నమ్మకం పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ‘బాహుబలి'(రికార్డులను) తిరగరాసింది. అయితే అది తెలుగు వెర్షన్ వరకు మాత్రమే.మిగిలిన వెర్షన్ల విషయంలో ‘బాహుబలి'(సిరీస్) కలెక్షన్లను మించుతుందా లేదా? అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్.
ఒకసారి ‘ఆర్.ఆర్.ఆర్’ 10 డేస్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 97.00 cr |
సీడెడ్ | 44.50 cr |
ఉత్తరాంధ్ర | 28.12 cr |
ఈస్ట్ | 13.85 cr |
వెస్ట్ | 11.47 cr |
గుంటూరు | 16.34 cr |
కృష్ణా | 12.95 cr |
నెల్లూరు | 07.96 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 232.19 cr |
తమిళనాడు | 33.58 cr |
కేరళ | 09.25 cr |
కర్ణాటక | 36.95 cr |
హిందీ | 91.10 cr |
ఓవర్సీస్ | 84.20 cr |
రెస్ట్ | 06.93 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 494.20 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని) |
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.494.2 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.898 కోట్లను కొల్లగొట్టింది.ఓవర్ ఆల్ గా బిజినెస్ పై పెట్టింది రికవరీ అయిపోయింది కానీ క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.
తెలుగు వెర్షన్ వరకు ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. హిందీలో కూడా స్లోగా స్టార్ట్ అయినా తర్వాత నుండీ పుంజుకుంది. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయం. కానీ ‘బాహుబలి2’ ఓవరాల్ కలెక్షన్లను అధిగమించడం కష్టమనే చెప్పాలి. ‘బాహుబలి2’ ఫుల్ రన్లో రూ.814 కోట్ల పైనే షేర్ ను రాబట్టి.. రూ.1783 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?