RRR 3D: త్రీడీ వెర్షన్ వల్ల ఆర్ఆర్ఆర్ కు అంత లాభమా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దాదాపుగా మూడున్నరేళ్లు తీవ్రంగా శ్రమించారు. ఇద్దరు హీరోలతో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించడంతో పాటు ఆ సినిమాను విడుదల చేసి రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు అన్ని భాషల్లోనూ అంచనాలను మించి కలెక్షన్లను సాధిస్తోంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ వల్ల కొన్ని హిందీ సినిమాలకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజైన సమయంలో ఆర్ఆర్ఆర్ త్రీడీ వెర్షన్ గురించి నెగిటివ్ కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే.

కొంతమంది నెటిజన్లు ఆర్ఆర్ఆర్ ను త్రీడీలో విడుదల చేసి జక్కన్న తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికే ఈ సినిమాను 2డీలో చూసిన ప్రేక్షకులు 3డీలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాను త్రీడీలో విడుదల చేయాలని అస్సలు భావించలేదు. ఒక త్రీడీ కంపెనీ క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వడంతో రాజమౌళి త్రీడీకి అంగీకరించారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీని త్రీడీలో ప్రదర్శిస్తున్న థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయని తెలుస్తోంది.

త్రీడీ వెర్షన్ రిలీజ్ వల్ల ఆర్ఆర్ఆర్ మేకర్స్ కు అదనంగా 20 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల వరకు లాభాలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ లో జంతువులతో చిత్రీకరించిన సీన్లు త్రీడీలో అద్భుతంగా వచ్చాయని సమాచారం. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో రాజమౌళి భవిష్యత్తు సినిమాలను సైతం త్రీడీలో రిలీజ్ చేయాలని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహేష్ తో రాజమౌళి తెరకెక్కించే సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రాజమౌళి 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతున్నా ఆర్ఆర్ఆర్ స్థాయి బడ్జెట్ లోనే ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. మహేష్ సైతం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus