RRR Collections: బన్నీ, మహేష్ సినిమాల కంటే తక్కువగా ‘ఆర్.ఆర్.ఆర్’ కలెక్షన్స్.!

త్రిబుల్ ఆర్ సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద ఏడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని మొదటి వారం అత్యధిక వసూళ్లను సాధించిన పాన్ ఇండియా సినిమాగా రికార్డుకెక్కింది. రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్స్ అందరికీ షాక్ ఇస్తున్నాయి అనే చెప్పాలి. అయితే మొదటి ఆరు రోజుల వరకు కూడా సినిమా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసినప్పటికీ ఏడవ రోజు మాత్రం అల్లు అర్జున్ మహేష్ సినిమాల కంటే తక్కువ స్థాయిలో షేర్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

Click Here To Watch NOW

త్రిబుల్ ఆర్ సినిమా ఏడవ రోజు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో టోటల్ గా 187కోట్ల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ప్రపంచవయాప్తంగా 392.45కోట్ల షేర్ సాధించింది. ఇక గ్రాస్ లో అయితే వరల్డ్ వైడ్ గా ‘ఆర్.ఆర్.ఆర్’ 700కోట్లను సాధించినట్లు సమాచారం. ఇక చాలా ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమా 7వ రోజు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో 5వ స్థానంలో నిలవడం విశేషం.

మొదట అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో సినిమా 7వ రోజు రూ.8.43కోట్ల షేర్ ను అందుకుంది. అనంతరం బాహుబలి 2 రూ.8.30 కోట్లు రాబట్టగా.. మెగాస్టార్ చిరంజీవి సై రా రూ.7.90కోట్లు, సరిలేరు నీకెవ్వరు రూ.7.64కోట్ల షేర్ తో 7వ రోజు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు ఆ సినిమాల కంటే తక్కువగా రూ.7.48కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి 5వ స్థానంలో నిలిచింది.

అయితే 7 రోజుల్లో టోటల్ కలెక్షన్ల విషయంలో మాత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ రూ.187 కోట్లతో టాప్ లో ఉంది. ఇక హిందీలో కూడా కలెక్షన్స్ అయితే తగ్గుతున్నాయి. మరి ఉగాది వీకెండ్ లో సినిమా ఇంకాస్త పుంజుకుంటుందో లేదో చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus