RRR Collections: కలెక్షన్లలో ఆర్ఆర్ఆర్ రికార్డులు సృష్టిస్తుందా?

బాహుబలి2 సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఏకంగా 121 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. బాహుబలి2 కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ కాబట్టే బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డులు సృష్టించాయి. బాహుబలి2 సినిమా విడుదలై దాదాపు ఐదేళ్లైంది. అప్పటికీ ఇప్పటికీ టికెట్ రేట్లలో ఊహించని స్థాయిలో మార్పులొచ్చాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో సినిమా టికెట్ రేట్లు గరిష్టంగా 2,200 రూపాయల వరకు ఉండటం గమనార్హం.

అందువల్ల ఆర్ఆర్ఆర్ మూవీ తొలిరోజే 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆకాశమే హద్దుగా ఈ సినిమా కలెక్షన్లు ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్టీఆర్ మరో సినిమాలో నటించకుండా మూడున్నరేళ్లు ఈ సినిమాకు పరిమితమై ఆర్ఆర్ఆర్ తో కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని నమ్ముతున్నారు.

పదికి పైగా భాషల్లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుండగా ఓవర్సీస్ లో ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డులు సృష్టిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఓవర్సీస్ లో ఏకంగా థియేటర్ ను బుక్ చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో కొన్ని వివాదాలు నెలకొన్నా సినిమా రిలీజ్ సమయానికి సమస్యలు పరిష్కారం అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జక్కన్న చరిత్రను వక్రీకరిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతుండగా సినిమా విడుదల తర్వాత ఈ వివాదాలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్లతో బాహుబలి2 సాధించిన కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేయాల్సిన బాధ్యత రాజమౌళిపై ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగగా హిందీలో మాత్రం ఈ సినిమాను మేకర్స్ ఓన్ గా రిలీజ్ చేసుకుంటున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus