RRR Review: విడుదలకు ముందే లీకైన ఆర్ఆర్ఆర్ రిపోర్ట్!

  • December 30, 2021 / 12:59 PM IST

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు థియేటర్లలో చరణ్, తారక్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రికార్డు స్థాయి థియేటర్లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుండగా బాహుబలి2 సినిమాను మించి ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధిస్తుందని చరణ్, తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి బాలీవుడ్ మీడియా నుంచి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ బాలీవుడ్ సంస్థ ఆర్ఆర్ఆర్ మూవీ అంచనాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఉందని

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల మధ్య స్నేహాన్ని జక్కన్న అద్భుతంగా చూపించారని తెలిపింది. సినిమాలోని ప్రతి సన్నివేశంలో రాజమౌళి మార్క్ కనిపిస్తుందని ఈ సంస్థ పేర్కొంది. ఆర్ఆర్ఆర్ మూవీ విజువల్ వండర్ లా ఉందని బాలీవుడ్ సంస్థ పాజిటివ్ గా రివ్యూ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ తో కొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని ఆ సంస్థ పరోక్షంగా చెప్పింది. లీకైన ఆర్ఆర్ఆర్ రిపోర్ట్ పాజిటివ్ గా ఉండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీస్థాయిలో కలెక్షన్లను సాధించడం ఖాయమని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా ఆర్ఆర్ఆర్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీతో జక్కన్న బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ చేయడం గ్యారంటీ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి ఎమోషన్స్ కు, యాక్షన్ సీన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని బోగట్టా.

అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆర్ఆర్ఆర్ ఉంటుందో లేదో తెలియాలంటే మాత్రం మరో వారం రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తొలిరోజే ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. 2022 సంవత్సరంలో ఆర్ఆర్ఆర్ తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus