బాహుబలి 2 ని దాటడం ఆర్ఆర్ఆర్ కి సాధ్యమేనా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పై దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ నెలకొనివుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తరువాత రాజమౌళి నుండి వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ కావడంతో అందరిలో ఆసక్తినెలకొని ఉంది. ఇక రాజమౌళి కేర్ ఆఫ్ హిట్ గా ఉన్నారు. ఇంత వరకు అపజయం ఎరుగని రాజమౌళి ప్రతి సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తాడనే పేరుఉంది. అందుకే ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రీ రిలీజ్ బిసినెస్ భారీ స్థాయిలో నడుస్తుంది. విశేషం ఏమిటంటే 2017లో వచ్చిన బాహుబలి 2 బిజినెస్ కి మించి ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ జరుపుకుంటుంది. తెలుగు మరియు తమిళ్ మిగతా సౌత్ బాషలతో పాటు ఓవర్సీస్ కలుపుకొని ఈ చిత్రం 400 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

దాదాపు నైజాంలో 75 కోట్లు, ఆంధ్రా 100 కోట్లు, ఓవర్సీస్ 40 కోట్లు, కర్ణాటక 50 కోట్లు బిజినెస్ జరిపినట్లు తెలుస్తుంది. ఇది బాహుబలి 2 చిత్ర బిజినెస్ కంటే ఎక్కవ కావడం విశేషం. ఐతే ఆర్ ఆర్ ఆర్ ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరిపిన నేపథ్యంలో మూవీ బాహుబలి2 కి మించి విజయం సాధించాలి. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచుకున్నప్పుడే ఈ మాత్రం వసూళ్లు సాధ్యం అవుతాయి. అలా కాకుండా టాక్ కొంచెం అటూ ఇటూ ఐతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. భారీ ధరలకు ఏరియా హక్కులు దక్కించుకున్న బయ్యర్లు భారీ నష్టాలు భరించాల్సివస్తుంది. ప్రభాస్ గత చిత్రం సాహో ఇందుకు మంచి ఉదాహరణ. భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సాహో చిత్రం వరల్డ్ వైడ్ గా 420 కోట్లకు గ్రాస్ వసూలు చేసి కూడా హిందీ మినహా అన్ని భాషలలో భారీ నష్టాలు మిగిల్చింది. మరి బాహుబలి 2 కి మించిన ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ ఆ చిత్రం వలె వందల కోట్ల వసూళ్లు రాబట్టడం సాధ్యమేనా..?

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus