ఒకే సినిమాను రెండు థియేటర్లలో విడుదల చేయడం మీరు చూసే ఉంటారు. ఇప్పుడుంటే అలవాటు అయిపోయింది కానీ.. ఒకప్పుడు ఇలా డబుల్ థియేటర్ రిలీజ్ చాలా పెద్ద విషయం. అలా ఒకే సినిమాను రెండు ఓటీటీల్లో రిలీజ్ చేయడం కూడా మీరు చూసే ఉంటారు. పెద్ద పెద్ద సినిమాలు ఇలా రెండేసి ఓటీటీల్లో వస్తున్నాయి. అయితే ఒకే సినిమా మూడు ఓటీటీల్లో వస్తే.. అలా కూడా వస్తాయా? అంటారా. వస్తాయి అలాంటి సినిమాలు కూడా ఉంటాయి.
తారక్ – రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి రూపొందించిన చిత్రం ‘ఆర్‌ఆర్ఆర్’. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సాధించిన విజయం గురించి చెప్పాలంటే దాని వసూళ్ల సంగతి చెప్పాలి. సుమారు రూ. 1200 కోట్ల వసూళ్లతో సినిమా బంపర్ విజయం అందుకుంది. ఆ తర్వాత ఓటీటీల్లోకి వచ్చి ఆ జోరును డబుల్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ అందుబాటులోకి రాగా, జీ5లో ప్రాంతీయ భాషలు వచ్చాయి. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు.
మంగళవారం ఉదయం నుండి హాట్‌స్టార్ ఓటీటీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ అందుబాటులోకి వచ్చింది. దీంతో జీ5, నెట్‌ఫ్లిక్స్ లాంటి వాటిలో సబ్‌స్క్రిప్షన్ లేనివాళ్లు ఇప్పుడు హాట్‌స్టార్‌లో చూడొచ్చు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఓటీటీ ప్రయాణం ఇక్కడితో ఆగుతుందా? లేక మరిన్ని ఓటీటీలకు వెళ్తుందా అనేది చూడాలి. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, జీ5ల ప్రచారం కారణంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన ‘ఆర్‌ఆర్‌ఆర్’… ఇప్పుడు మరోసారి అదే పనిలో ఉంటుంది. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ పేరుతో హాట్ స్టార్ సందడి చూడాలి.
మరోవైపు సినిమాను జపాన్‌లో కూడా విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 21న అక్కడ ‘ఆర్‌ఆర్‌ఆర్’ని విడుదల చేస్తున్నట్టు ఇటీవల సినిమా వర్గాలు వెల్లడించాయి. జపాన్‌లో విడుదల సందర్భంగా చిత్రబృందం మరి ప్రచారం చేస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ చేస్తే వసూళ్లు భారీగానే ఉంటాయి. అలాగే చైనాలో కూడా సినిమా విడుదల చేస్తారని వార్తలొస్తున్నాయి. మరి ఆ తీపికబురు ఎప్పుడో చూడాలి. ఒకవేళ అదేజరిగితే వసూళ్లు వావ్ అనిపిస్తాయి.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!